సలహాదారుల రూపంలో ఏపీ ప్రజల సొమ్మును దిగమింగుతున్న కొంత మంది… తమ సేవలకు ప్రతిఫలంగా కుటుంబసభ్యులకూ దోచి పెట్టే పనులు చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతూండటంతో వైసీపీ కోసం అడ్డగోలు పనులు చేస్తున్న సలహాదారులు ఇదే సందనుకుని కుటుంబసభ్యులకూ పదవుల పందేరం చేసుకుంటున్నారు. తాజగా నెలకు నాలుగైదు లక్షల జీతం తీసుకునే సలహాదారు దేవులపల్లి అమర్.. తన సోదరుడికీ ఓ పదవి ఇప్పించేసుకున్నారు.
తెలంగాణలో తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా దేవులపల్లి అజయ్‌ను నియమిస్తూ కార్యనిర్వహణ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్ నిర్మాణంలో ఉన్న ఆలయాలను పర్యవేక్షించడంతో పాటు కరీంనగర్ తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ది కార్యక్రమాల్లో సేవా భావంతో పాల్గొనాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈయన దేవులపల్లి అమర్ సోదరుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సేవాభావంతో పేర్కొనాలని ఉత్తర్వులు ఇచ్చినా టీటీడీలో సలహాదారు పదవి ని ఎలా ఉపయోగించుకుంటారో అందరికీ తెలుసు కాబట్టి దేవులపల్లి అమర్ తేలివితేటల్ని చూసి జర్నలిస్టులు అబ్బురపడుతున్నారు.
జర్నలిజాన్ని నమ్ముకున్నట్లుగా నటించి చివరికి అమ్ముకునేందుకు ఏ మాత్రం వెనుకాడని వ్యక్తిగా దేవులపల్లి అమర్ రికార్డులకు ఎక్కుతారు. చివరికి జర్నలిస్టులకు వ్యతిరేకంగా జీవోలు జారీ చేసినా మాట్లాడలేని పరిస్థితి. సొంతానికి పదవులతో మాత్రం పండ గ చేసుకుటున్నారు. ఉద్యమ సమయంలో ఏపీ ప్రజల్ని బూతులు తిట్టిన అమర్.. ఆ ప్రజల సొమ్మునే ఇష్టారాజ్యంగా తీసుకోవడానికి ఏ మాత్రం సిగ్గుపడటం లేదు.