జర్నలిజం కెరీర్లో ఎవరూ చేయని ఆరోపణల్ని చేసిన వేణు స్వామి దంపతులు తప్పు చేశామని లెంపలు వేసుకునే వరకూ వదిలి పెట్టేది లేదని మూర్తి పట్టదలగా ఉన్నారు. తప్పుడు ఆరోపణలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన.. తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు. తన అనుచరుడు అని చెప్పిన వ్యక్తి ఎవరో.. అతను ఏ నెంబర్ నుంచి కాల్ చేశాడో.. వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే తానే బయట పెట్టి కుట్ర చేశారని చెప్పి సంభాషణలు జరిపిన ఇద్దరి మధ్య కేసు పెడతానని ప్రకటించారు.
తనపేరు వాడుకొని అలాంటి నేరాలు చేస్తున్న వ్యక్తులను పట్టుకొని శిక్షించాలని పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. తన పేరుతో డబ్బులు అడగడం వల్లే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చారని చెబుతున్నారు కాబట్టి డబ్బులు అడిగిన అమర్ అనే వ్యక్తి ఎవరో బయట పెట్టాలని మూర్తి డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అమర్ అనే వ్యక్తి వేణు స్వామి దంపతులకే సన్నిహితుడు. అతనితో కలిసి కామాఖ్య సహా ఇతర ఆలయాలకు వెళ్లారని స్వయంగా మూర్తి ప్రకటించారు.
ఇప్పుడు ఈ అమర్ అనే వ్యక్తిని పోలీసులకు అప్పగించకపోతే అతని గురించి వివరాలు బయట పెట్టి ఆ ఆడియోను వేణు స్వామినే క్రియేట్ చేయించారని తేల్చి కేసులు పెట్టే చాన్స్ ఉంది. ఒక వేళ అప్పగిస్త అసలు నిజాన్ని పోలీసులు కక్కిస్తారు. పైగా పోలీసులు త్వరగా స్పందించాలని రేవంత్ రెడ్డిని మూర్తి ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు. ఎలా చూసినా మూర్తికి క్షమాపణలు చెప్పి.. బయటపడకపోతే వేణు స్వామి ఇంకా మునగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.