సునీల్ టైమ్ మరీ బ్యాడ్ గా ఉంది. విజయాలు ఏనాడో దూరమైపోయాయి. ఫ్లాప్‌ల కంటే డిజాస్టర్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సునీల్‌తో సినిమా తీయడం సాహసంలా మారింది. సినిమా తీసినా, డబ్బులొస్తాయన్న గ్యారెంటీ లేని పరిస్థితి. శాటిలైట్ అవ్వడమే గగనం అయిపోతోంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో వస్తోంది. టూ కంట్రీస్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల అవుతోంది. విడుదలయ్యాక పరిస్థితి ఏమిటో చెప్పలేం కదా, అందుకే ఈ సినిమాని ముందే శాటిలైట్‌కి ఇచ్చేశారు. జెమిని టీవీ రూ.2.5 కోట్లకు ఈ సినిమా కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రూ.2.5 కోట్లు శాటిలైట్ రూపంలో రావడం, అందులోనూ విడుదలకు ముందే బేరం జరిగిపోవడం గొప్ప విషయమే. మలయాళంలో విడుదలై, మంచి విజయం సాధించిన టూ కంట్రీస్‌కి ఇది రీమేక్. మరి ఆ అదృష్టం ఇక్కడ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.