మాజీ మంత్రి కేటీఆర్.. ఓ రాజకీయ సలహాదారును ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే సలహాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఆయన చేస్తోన్న రాజకీయం వికటిస్తోందని..తిరిగి ఫామ్ లోకి రావాలంటే అర్జెంట్ గా ఓ స్ట్రాటజిస్ట్ ను నియమించుకోవాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.
కేసీఆర్ విద్యుత్ కొనుగోళ్లపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయనకు కాస్త ఊరట లభించింది. జస్టిస్ నరసింహా రెడ్డిని తప్పించి మరో జడ్జితో పవర్ కమిషన్ ఏర్పాటు చేసి .. విద్యుత్ కొనుగోళ్ల, ఒప్పందాలపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. అంతేకాని, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ చేయవద్దని ఎక్కడా సుప్రీంకోర్టు పేర్కొనలేదు.
సుప్రీంకోర్టు సూచన మేరకు ప్రభుత్వం మరో జడ్జితో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తే.. ఆ కమిషన్ విచారణకు కేసీఆర్ సహకరించాల్సిందే. అయినప్పటికీ ఈ తీర్పుపై కేటీఆర్ సత్యమే జయతే అంటూ ఎక్స్ లో ట్వీట్ చేయడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. పవర్ కమిషన్ ఏర్పాటును సుప్రీంకోర్టు తిరస్కరించినట్లుగా ఆయన ట్వీట్ ఉందని.. కోర్టు తీర్పును మరోసారి కేటీఆర్ చదువుకోవాలని హితవు పలుకుతున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు అర్థం చేసుకోవడంలో పొరబడుతున్నారని.. రాజకీయ వ్యూహాలను రచించడంలో ఫెయిల్ అవుతున్నారని.. అందుకే కేటీఆర్ అర్జెంట్ గా ఓ వ్యూహకర్తను అపాయింట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.