మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీని అరెస్టు చేసేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. ఇప్పటికే ఈ కేసులో బాపులపాడు ఎంపీపీ సహా పదిహేను మందిని గత నెల 9న అరెస్టు చేయగా ఆ తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేశారు..ఈ క్రమంలోనే ఈ కేసులో 71వ నిందితుడిగా ఉన్న వంశీని అరెస్టు చేస్తారని అంతా భావించారు.
అయితే, ఈ కేసులో వంశీ అరెస్టు జరగకపోవడంతో ఆయనను వదిలిపెట్టారని టీడీపీ శ్రేణులు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యేగా టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయించడమే కాకుండా.. యువగళం పాదయాత్ర సమయంలోనూ పాదయాత్రను ఆటంకం కలిగించేలా వంశీ ఎన్నో ప్రయత్నాలు చేపట్టారు. లోకేష్ పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలను పాల్గొనకుండా వేధించారు. అయినా వంశీపై ఎలాంటి చర్యలు లేవని టీడీపీ శ్రేణులు అసంతృప్తికి గురయ్యాయి.
Also Read : నేతలకు కీలక ఆదేశాలు..చంద్రబాబు మరో కీలక నిర్ణయం
ఈ నేపధ్యంలోనే జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గంగాధర రావు ఈ వ్యవహారంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా…ఆయన ప్రమేయంతోనే ఇదంత జరిగిందని ఆరోపణలు ఉండటంతో ఈ కేసులో ఇప్పటికే ఆయన్ను కూడా చేర్చడంతో తాజాగా వంశీ అరెస్టుకు సిద్ధమయ్యారు. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత వంశీ హైదారాబాద్ లోనే ఉంటున్నారు. దాంతో ఆయనను అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలు హైదారాబాద్ వెళ్లాయి.
ఇప్పటికే ఈ కేసులో తన అరెస్టు ఖాయమని ముందు నుంచి భావిస్తున్న ఆయన .. భయంతో అమెరికా వెళ్లి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.