చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె అయిన భువనేశ్వరి క్యారెక్టర్‌పైనే నిందలేసిన వల్లభనేని వంశీ .. పరిస్థితి తీవ్రంగా మారుతుందని అనుకున్నారేమో కానీ క్షమాపణలు చెప్పారు. బుధవారం టీవీ నైన్లో ఫోనోలో ఇంటర్యూలు ఇచ్చి క్షమాపణలు చెప్పిన ఆయన గురువారం వరుసగా మీడియాప్రతినిధుల్ని పిలిచి ఇంటర్యూలుఇచ్చారు. అందులో ఓ మాటలో భువనేశ్వరికి క్షమాపణలు చెప్పి.. ఇక ఎప్పట్లాగే చంద్రబాబుపై రాజకీయ విమర్శలు చేశారు.అందులో భాగంగా ప్రతి మీడియా చానల్‌కు కామన్‌గా వల్లభనేని వంశీ ఓ మాట చెప్పుకుంటూ వచ్చారు.
అదేమిటంటే.. అన్ని పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషుల్ని పంపించారట. బీజేపీలోకి ఎంపీల్ని పంపించారట. ఆ లెక్కన టీడీపీ తరపున గెలిచిన వంశీని కూడా చంద్రబాబే వైసీపీలోకి పంపించి ఉంటారు కదా అని..ఆయన మాటల్ని మీడియాలో.. సోషల్ మీడియాలో చూస్తున్న వారికి సందేహం . ఆ సందేహం వంశీకి రాలేదేమో కానీ.. వైసీపీ హైకమాండ్‌కు వస్తే మాత్రం ఎటూకాకుండా పోతారన్న సెటైర్లు మాత్రం పడుతున్నాయి.
వల్లభనేని వంశీ ఒకప్పుడు వైసీపీలో అన్నం తినేవాడు ఎవడూ చేరడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు అదే పార్టీలో చేరి అన్ని గీతలు దాటేసి దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా తిడుతున్నారు. మహిళల్ని కించ పరుస్తున్నారు. ఈ పరిణామాలు తర్వాత ఎలా ఉంటాయో కానీ ఇప్పటికైతే వంశీకి అలాంటి మాటలు మాట్లాడినందుకు కూడా సరైన అవకాశాలు వస్తున్నాయో రావట్లేదో చెప్పడం కష్టమే.