“నేను వదిలేస్తే గాలికిపోతావని” వంగవీటి రాధాను..జగన్మోహన్ రెడ్డి అవమానించారు. దానికి కౌంటర్‌గా తనను వదిలేయడం వల్ల.. జగన్మోహన్ రెడ్డి ఎటు పోతాడోచూపించాలని… వంగవీటి రాధా పట్టుదలగా ఉన్నారు. టిక్కెట్ ఇస్తామన్నా… రాష్ట్ర వ్యాప్త ప్రచారానికే మొగ్గు చూపిన వంగవీటి రాధా… ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్‌గా మారారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత సైలెంట్‌గా ఉన్న వంగవీటి రాధాను.. లగడపాటి రాజగోపాల్ టీడీపీలో చేేలా మధ్య వర్తిత్వం చేశారు. చంద్రబాబు టిక్కెట్ కూడా ఆఫర్ చేశారు. కానీ తన లక్ష్యం జగన్ ఓడిపోవాలన్నదేనని… వంగవీటి చెప్పారు. తన అవసరం ఎక్కడ ఉందో అక్కడకు వెళ్లి ప్రచారం చేస్తానని చెప్పారు.
ఇప్పుడు వంగవీటి రాధాను… పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాలకు ఉపయోగించుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంది టీడీపీ. కొన్ని కార్యక్రమాలు పార్టీ చెబుతుందని, మరికొన్ని కార్యక్రమాలకు తనతో పాటు రావాలని సీఎం ఆహ్వానించారు. వెంటనే ఆయనకు స్టార్ క్యాంపెయినర్ హోదా కూడా ఇచ్చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు జాబితాను కూడా పంపారు. ఇప్పటికే వంగవీటి రాధా, వల్లభనేని వంశీతో పాటు పలువురు తెలుగుదేశం అభ్యర్దుల నామినేషన్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తనకు గట్టి పట్టు ఉన్న … విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొండా ఉమా ఏర్పాటు చేసిన ర్యాలీకి కూడా హాజరయ్యారు.
వంగవీటి రాధాపై బ్యాడ్ రిమార్కులేమీ లేవు. ఆయనకు క్రేజ్ ఉంది. ఓ సామాజికవర్గంలో.. పట్టు ఉంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ తరుణంలో… వంగవీటి రాధాను.. పకడ్బందీగా ఉపయోగించుకోవడానికి టీడీపీ ఏర్పాట్లు చేసుకుంది. వంగవీటి రాధా కూడా.. తాను నిజంగా ఎన్నికల్లో నిలబడితే ఎలా కష్టపడతారో… అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. టీడీపీ నేతలతో కలసి పోతున్నారు. మామూలుగా… వల్లభనేని వంశీ, కొడాలి నాని, వంగవీటి రాధా మిత్రులు. వల్లభనేని వంశీకి నేరుగా ప్రచారం చేశారు. కానీ కొడాలి నానికి చేసే అవకాశం లేదు. గుడివాడలో కాపు ఓట్లు ఇప్పుడు కీలకం. అయితే అక్కడ పోటీ దేవినేని అవినాష్ తో కాబట్టి… వంగవీటి రాధా టీడీపీ తరపున ప్రచారానికి రాడని.. కొడాలి నాని ధీమాతో ఉన్నారు.