తెలుగులో తొలి సబ్ మెరైన్ సినిమా తీసిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ‘ఘాజీ’తో తెలుగు సినిమాను ఓ మెట్టు పైకి ఎక్కించిన అతను, ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. స్పేస్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్ మూవీలో వరుణ్ తేజ్ ఆస్ట్రోనాట్‌గా నటిస్తున్నాడు. టెక్నికల్‌గా ఈ సినిమా కూడా ఉన్నత స్థాయిలో వుండబోతోంది. సీజీ వర్క్ కోసం గురువారం వరుణ్ తేజ్ బాడీని త్రీడీ స్కాన్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. సీజీ వర్క్ అవసరమైన సన్నివేశాలను ముందుగా షూట్ చేసి గ్రాఫిక్ వర్క్‌కి పంపేలా ప్లాన్ చేశార్ట. హీరోల బాడీలను త్రీడీ స్కానింగ్ చేయడం ఇటీవల ఎక్కువైంది. ‘సైరా’ కోసం చిరంజీవి, రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ బాడీలను కూడా త్రీడీ స్కానింగ్ చేశారు. దీనివల్ల సీజీ వర్క్ ఈజీగా పూర్తవుతుందట. టెక్నాలిజీని వుపయోగించుకోవడంలో ఇటీవల తెలుగు సినిమా చురుగ్గా వ్యవహరిస్తోంది.