టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లి.. మొత్తంగా నిర్మించుకున్న రాజకీయ జీవితాన్ని కుప్పకూల్చున్నారు వాసుపల్లి గణేష్ కుమార్. ఇప్పుడు ఆ పార్టీలోనూ ఆయనను పట్టించుకునేవారు లేకపోవడంతో విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సమన్వయకర్తగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా వైవీ సుబ్బారెడ్డికి ఓ లేఖ రాసేశారు. విజయ సాయిరెడ్డి ఉన్నప్పుడే ఆయనను పక్కన పెట్టారు. సుబ్బారెడ్డి విశాఖకు ఇంచార్జ్‌గా ావచ్చిన తర్వాతైనా తనను గుర్తిస్తారని ఆయన ఆశపడ్డారు. కానీ సుబ్బారెడ్డి వచ్చిన తొలిరోజే ఆయనను పట్టించుకోలేదు. దీంతో ఆయన మరోసారి హర్టయ్యారు.
సుబ్బారెడ్డికి ఓ లేఖ రాశారు. అందులో తన కులాన్ని హైలెట్ చేసుకున్నారు. తాను బీసీ వర్గం నుంచి వచ్చానని.., టీడీపీ తనను ప్రోత్సాహించిందని చాలా గొప్పగానే చెప్పుకున్నారు. అయితే జగన్ పాలన నచ్చి వైసీపీలో చేరానని కానీ తనను పట్టించుకోవడం లేదన్నారు. అందుకే ఎవరూ అడగకపోయినా సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే పార్టీకి బద్దుడుగా ఉంటానని మాత్రం చెప్పుకొచ్చారు. చివరికిగా ఓ ఆప్షన్ ఉంచుకున్నారు.
వాసుపల్లికి వైసీపీలో టిక్కెట్ లేదని ఖాయమయింది. ఇప్పుడు ఆయనను ఆ పార్టీ నేతగానే ఎవరూ చూడటం లేదు. అదే సమయంలో ఆయనను మళ్లీ టీడీపీలోకి ఎవరూ ఆహ్వానించడం లేదు. ఓ సారి చంద్రబాబును కలిసే ప్రయత్నం చేసినా… సాధ్యం కాలేదని చెబుతున్నారు. అయితే అధికారికంగా ఇప్పటికీ టీడీపీ సభ్యుడే. ఆయన వైసీపీలో చేరలేదు. అందుకే వైసీపీకి రాజీనామా అనే ప్రశ్నే లేదు. అయినా సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించేశారు.