తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా… ఓ మై కడవులే. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. `ఓరి దేవుడా` పేరుతో. విశ్వక్సేన్ హీరో. అశ్వత్ మరిముత్తు దర్శకుడు. ఈ సినిమాలో దేవుడి పాత్ర కీలకం. తమిళంలో ఆ పాత్రని విజయ్ సేతుపతి చేశాడు. తెలుగులో దాన్ని ఓ టాప్ హీరోతో చేయించాలని గత కొన్నాళ్లుగా చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాకి దేవుడు దొరికేశాడు. ఆ పాత్ర చేయడానికి వెంకటేష్ ఒప్పుకొన్నారు. ఆయన ఈ సినిమాకి ఇచ్చింది నాలుగైదు రోజుల కాల్షీట్లే. తమిళంలో విజయ్‌సేతుపతి మీద కేవలం 3 రోజుల్లో ఆయా సన్నివేశాల్ని తెరకెక్కించారు. దాంతో పోలిస్తే.. వెంకీ కాస్త ఎక్కువ కాల్షీట్లు ఇచ్చినట్టే లెక్క. వెంకీ ఆగమనంతో `ఓరి దేవుడా` లుక్ పూర్తిగా మారిపోనుంది. మిథాలీ పార్కర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా తెరకెక్కిస్తోంది. వెంకటేష్ పార్ట్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. వెంకీ కోటా కూడా అయిపోతే, సినిమా సిద్ధమైపోయినట్టే.