శుభమా అని బయట తమ కుటుంబాల్లో సంతోషాలను వెదుక్కుంటూంటే.. వారు నాశనమైపోతారంటూ బయట జాతకాలు, జోస్యాలు అంటూ వీడియోలు చేసే నికృష్ట స్వాముల్ని ఏం చేయాలి ?. తప్పయిపోయింది మహా ప్రభో ఇంకో సారి .. పిచ్చి పిచ్చి జాతకాలు చెప్పను..నాకేం తెలియదు అని కాళ్లా వేళ్లా పడిన తర్వాత కూడా ఇలాంటి వేషాలు వేస్తున్న వెలికి స్వాముల్ని ఏం చేయాలి ? . టిక్ టాక్ లు..వీడియోలు చేసుకోకుండా… కుటుంబాలపై.. వ్యక్తుల ప్రాణాలపై జోస్యాలపై చెప్పే ఇలాంటి స్వాములకు ఏదో ఒకటి బుద్ది చెప్పాల్సిందే. లేకపోతే అది వైరస్‌లా పాకిపోయే ప్రమాదం ఉందన్న భావన టాలీవుడ్లో వినిపిస్తోంది.
శోభిత ధూళిపాళ్ల, నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వారు సెలబ్రిటీలు కాబట్టి ఆసక్తి ఉంటుంది. కానీ వారు రెండేళ్లలో ఇలా అయిపోతారు.. మూడేళ్లలో ఇలా అయిపోతారని ప్రచారం చేయడం శాడిజమే. ఇలా చెప్పేవారికి తదపరి క్షణంలో తన ఊపిరి ఉంటుందో లేదో జోస్యం చెప్పుకోలేడు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికీ తర్వాతి క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ.. ఆ కుటుంబాల్ని బ్లాక్ మెయిల్ చేసి.. శాంతి పూజలో.. మరొకటనో చెప్పి డబ్బులు దండుకునేందుకు ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ కు ఆ స్వామి పాల్పడుతున్నాడని ఎవరికైనా అనిపిస్తే అందులో తప్పేం లేదు.
Also Read : అఫీషియల్: అక్కినేని ఇంటికి కొత్త కోడలు
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ హీరోపై తీవ్రమైన వ్యతిరేకతతో.. జాతకాలు చెప్పడం.. రాజకీయాల్లో కొన్ని పార్టీలకు అనుకూలంగా చెప్పడం వంటి వ్యవహారాల ద్వారా బాగానే డబ్బులు వెనకేసుకున్నాడు. ఇదేదో బాగుందని వ్యక్తిగత జీవితాల మీద పడుతున్నారు. అలాంటి స్వాములకు దొరికిన దగ్గర దేహశుద్ది చేస్తే తప్ప బుద్ది రాదని.. ఆ మాత్రం భయం ఉండకపోతే కష్టమని.. సినీ అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. చేసి చూపిస్తారేమో?