ఎమ్మెల్యే అంటే నియోజకవర్గం మొత్తం దోచుకోవడానికి పర్మిషన్ అన్నట్లుగా చెలరేగిపోయిన విడదల రజనీ వ్యవహారంపై వరుసగా ఫిర్యాదులు నమోదవుతున్నాయి. మాఫియాకు తగ్గని ఆమె సామ్రాజ్యం బారిన పడి డబ్బులు కట్టిన వారంతా ఇప్పుడు తమ డబ్బులు తమకు ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
మంత్రి పదవి రాక ముందే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిలుకలూరిపేటలో ఓ స్టోన్ క్రషర్ యజమానిని ఐదు కోట్లు డిమాండ్ చేశారు విడదల రజనీ. ఎందుకంటే ఎమ్మెల్యే కాబట్టి డబ్బులివ్వాల్సిందేనట. ఇచ్చేది లేదంటే… విజిలెన్స్ ఎస్పీగా ఉన్న జాషువాను దింపి యాభైకోట్లు ఫైన్ అని బెదిరించారు. నేరుగా విడదల రజనీ రంగంలోకి దిగి.. రెండున్నర కోట్లతో సెటిల్ చేసుకున్నారు. యాభై కోట్లు కట్టడంల కన్నా రెడున్నర కోట్లు కట్టడం బెటరని ఇచ్చేశారు.
కానీ ఇప్పుడు వారి టైం వచ్చింది. తాము డబ్బులు ఇచ్చిన సాక్ష్యాలు.. తమకు యాబై కోట్ల ఫైన్ పేరుతో వచ్చిన బెదిరింపుల సాక్ష్యాలు అన్నీ కలిపి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ విడదల రజనీపై వచ్చిన ఆరోపణలకు లెక్కలేదు. కొంత మందికి డబ్బులిచ్చేశారు కూడా. ఇక ముందు ఆమె వసూళ్ల జాబితా మొత్తం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.