విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్గా’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో విజయ్.. ‘గోవర్థన్`గా కనిపించనున్నాడు. గోవర్థన్ అనే పేరుతో విజయ్‌కు అటాచ్మెంట్ ఉంది. విజయ్ నాన్న పేరు గోవర్థన్. దర్శకుడు పరశురామ్ ఈ కథ చెబుతున్నప్పుడు విజయ్ దేవరకొండకు వాళ్ల నాన్నగారే గుర్తొచ్చార్ట. అందుకే ఆ పాత్రకు గోవర్థన్ అనే పేరు పెట్టేశాడు. అంతే కాదు… లుక్ వైజ్ కూడా నాన్నని ఫాలో అయ్యాడు దేవరకొండ. గోవర్థన్‌కి మీసాలు కాస్త ఒత్తుగా, కిందకు దిగి ఉంటాయి. అదే స్టైల్ లోకి విజయ్ మారిపోయాడు. కేవలం మీసాలు పెంచడం కోసమే.. కొన్ని రోజులు షూటింగ్ పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాలో చాలా సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నప్పుడు విజయ్‌కు వాళ్ల నాన్నగారే గుర్తొచ్చార్ట.
”మా నాన్న డైరీ ఎప్పుడు చూసినా.. అందులో జమా ఖర్చులే ఉండేవి. రాబడి ఎంత, ఖర్చెంత, ఈ లోటు ఎలా భర్తీ చేయాలి? అనే విషయాలే డైరీలో రాసుకొనేవారు. చిన్నప్పుడు నాకు సైకిల్ కొనుక్కోవాలని ఉండేది. డాడీని ప్రతీసారీ అడిగేవాడ్ని. వచ్చే సెలవల్లో కొనిస్తా అనేవాడు. కానీ కొనేవాడు కాదు. ఏ బ్యాటో కొని, ఆడుకోమనేవాడు. చివరికి ఓసారి లేడీ బర్డ్ సెకండ్ హ్యాండ్ లో కొన్నాడు. అది అమ్మాయిలు తొక్కేది. అందుకే మా అక్క సైకిల్ అని ఫ్రెండ్స్‌కి చెప్పేవాడ్ని. రెండేళ్లు అదే సైకిలేసుకొని తిరిగా. ఇలా మేం ఏం అడిగినా కాదు, కుదరదు అనేవాడు కాదు, ఏదోలా, ఎప్పటికో ఒకప్పుడు కొనిచ్చేవాడు. ఇవన్నీ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఫ్లాష్ కట్స్లా గుర్తొచ్చాయి” అంటూ తండ్రిని గుర్తు చేసుకొన్నాడు విజయ్. ఇలా ఓరకంగా ‘ఫ్యామిలీస్టార్’… విజయ్ దేవరకొండ డాడీ మినీ బయోపిక్‌లా మారిపోయింది. ఏప్రిల్ 5న ఈ సినిమా వస్తోంది. ఇదే వారంలో.. గోవర్థన్ పుట్టిన రోజు కూడా ఉందట. అలా.. ఈ సినిమాని డాడీకి బర్త్ డే కానుకగా అందిస్తున్నాడు రౌడీ బోయ్.