సౌత్‌లో దుమ్ము దులుపుతున్న హీరోల్లో విజయ్ దేవరకొండ కూడా స్థానం సంపాదించుకున్నాడు. వరుస విజయాలతో పాన్ ఇండియా రేంజ్‌కి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రొడెక్ట్కి బ్రాండ్ అంబాసిడర్‌గా అవతరించాడు. ప్రఖ్యాత కోకాకోలా కంపెనీకి చెందిన థమ్స్ అప్ కమర్షియల్ యాడ్లు విజయ్ చేతికి వచ్చాయి.
సౌత్‌లో పాపులర్ హీరోలతోనే థమ్సప్ యాడ్లు చేస్తుంటుంది. అప్పట్లో చిరంజీవి థమ్స్ అప్ యాడ్‌లో కనిపించడం గుర్తుండే ఉంటుంది. నిన్నా మొన్నటి వరకూ ఈ యాడ్ మహేష్ చేతిల్లో ఉండేది. ఇప్పుడు విజయ్ దగ్గరకు చేరింది. చిరు, మహేష్ చిత్రసీమలో అద్భుతమైన విజయాలెన్నో అందుకున్న తరవాత… ఈ యాడ్లు వాళ్లకు అందాయి. అయితే విజయ్ అంత టైమ్ తీసుకోలేదు. అతి తక్కువ వయసు, తక్కువ సినిమాలతోనే పాపులారిటీ సంపాదించి, థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎదిగాడు. తనపై తెరకెక్కించిన కమర్షియల్ యాడ్లు ఫిబ్రవరి 1 నుంచి ప్రసారం కానున్నాయి.