విజయ్ కుమార్ ఎందుకు వచ్చారంటే… ఆయన రామోజీరావు బంధువు విమానంలో వచ్చారని వాదిస్తున్నారు వైసీపీనేతలు. విజయ్ కుమార్ అనే జ్యోతిష్యుడ్ని జగన్ ప్రత్యేకంగా మైసూర్ నుంచి పిలిపించుకుని రోజంతా చర్చలు జరిపి హైదరాబాద్ పంపించారని మీడియా ప్రకటించడంతో వైసీపీ ఉలిక్కి పడింది. దీంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెర ముందుకు వచ్చారు. విజయ్ కుమార్ ను ఆయన స్వామిగా మార్చేశారు. విజయ్ కుమార్ స్వామి జగన్ ను ఆశీర్వదించడానికే వచ్చారని చెప్పుకొచ్చారు.
అబ్బా ఆశీర్వాదమా అని ఆశ్చర్యపడే లోపలే వైవీ సుబ్బారెడ్డి రామోజీకి లింక్ పెట్టేశారు. చింతా శశిధర్ అనే వ్యక్తి రామోజీ బంధువట. ఆయన విమానంలోనే విజయ్ కుమార్ స్వామి వచ్చారట. ఈ చింతా శశిధర్ ఎలా రామోజీకి బంధువయ్యాడు. నవయుగ కంపెనీ ఓనర్లలో ఒకరి కుమారుడు శశిధర్. తండ్రినే మోసం చేశాడనే పేరు కార్పొరేట్ ప్రపంచంలో ఉంది. ఆయన కు.. రామోజీ బంధువులు ఆయిన నవయుగ ఓనర్లకు సంబంధంలేదు. ఇప్పుడు ఈ చింతా శశిధర్ విశ్వసముద్ర అనే పేరు పెట్టుకుని ఏపీలో చాలా కాంట్రాక్టులు పొందుతున్నారు. తీసుకొచ్చింది జగన్ కోసం అయితే.. దానికి రామోజీకి లింక్ పెట్టాడు సుబ్బారెడ్డి.
ఇక్కడ కొసమెరుపేమిటంటే.. అసలు విజయ్ కుమార్ గురించి వార్తలు రాసింది రామోజీరావు కాదు.. ఆంధ్రజ్యోతి. అయినా సరే ఏదో ఓ లింక్ పట్టుకుందామని రామోజీరావు దగ్గరకు పోతున్నారు.. వైసీపీనేతలు. చేసిందే తప్పుడు పని.. ఇప్పుడు దాన్ని సమర్థించుకోవడానికి రకరకాల లింకులు వెదుక్కుంటున్నారు.
ఈ వివాదాస్పద జ్యోతిష్యుడు విజయ్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం గతంలో టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితునిగా పదవి ఇచ్చింది. అయితే ఇలాంటి నియామకం చెల్లుబాటు కాదని ఆ జీవోను హైకోర్టు కొట్టి వేసింది. అయినప్పటికీ విజయ్ కుమార్ టీటీడీలో కీలకంగా ఉంటున్నారు. వీఐపీ ప్రముఖులు వచ్చినప్పుడు ఆయనే దగ్గరుండి దర్శనాలు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా వీఐపీలతో విజయ్ కుమార్ దిగిన ఫోటోలను చూపించి టీడీపీ నేతలు సీఎం జగన్ ఆయనను లాబీయింగ్‌కు తీసుకు వచ్చారని విమర్శిస్తున్నారు.