అధికారంలోకి వచ్చారు. ఏళ్లు గడిచిపోయాయి. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు వైసీపీ పెద్దలకు క్యాడర్ అవసరం గుర్తొచ్చింది. అందర్నీ పిలిచి మళ్లీ ఎన్నికల్లో పోరాటం చేసిన వైసీపీని గెలిపించాలని .. జగన్ ను మళ్లీ సీఎం చేయాలి.. ఆఫీసుకు పిలిచి టీ, కాఫీలు ఇచ్చి ఉపదేశం చేస్తున్నారు. వచ్చిన వారంతా ఇచ్చినవి తిని, పెట్టినవి తాగి సరే అని వెళ్లిపోతున్నారు. కానీ ఒక్కరూ పార్టీ కోసం గట్టిగా పని చేస్తామని మాత్రం చెప్పడం లేదు.
విజయసాయిరెడ్డి ఇటీవల అనుబంధ సంఘాలతో విస్తృతంగా సమావేశం అవుతున్నారు. అధికారంలోకి వచ్చాక వాలంటీర్లదే రాజ్యం కావడంతో వైసీపీ క్యాడర్ నిర్వీర్యం అయిపోయింది. ఇక అనుబంధ సంఘాల గురించి చెప్పాల్సిన పని లేదు. యువత, విద్యార్థి, మహిళ, కార్మిక, డాక్టర్ ఇలా అనేక రకాల అనుబంధ సంఘాలను పెట్టి ఎన్నికలకు ముందు అందర్నీ వాడేసుకున్నారు. ఎన్నికల తర్వాత ఎవర్నీ పట్టించుకోలేదు. చివరికి వారికి ఏదైనా పనులు అవసరం అయినా చేసి పెట్టలేదు. మళ్లీ ఎన్నికలయ్యే సరికి వారందరూ గుర్తొచ్చారు. పిలిచి ఇక అందరం జగన్ ను సీఎం చేయడానికి పని చేద్దామని హితవు చెబుతున్నారు.
కానీ అనుబంధ సంఘాల నేతలందరూ ఇప్పుడు విజయసాయిరెడ్డి కానీ.. మరో నేత ముందు కానీ ఒకటే డౌట్ ఉంచుతున్నారు. గతంలో పోరాడి.. పార్టీని అధికారంలోకి తెస్తే… తమకేం ఒరిగిందని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పుకోవడానికి వైసీపీపెద్దల దగ్గర సబ్జెక్ట్ లేదు . అందుకే విజయసాయిరెడ్డి కూడా మొక్కుబడిగా పని చేయాలని చెబుతున్నారు కానీ.. వారికి ఫలానా మేలు చేస్తామని చెప్పలేకపోతున్నారు. మొత్తంగా పార్టీ అనుబంధ సంఘాలను యాక్టివేట్ చేయడం.. విజయసాయిరెడ్డికి పెద్ద సవాల్ గా మారింది.
మరో వైపు వైసీపీ సోషల్ మీడియా పరస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. ఎదుట పార్టీల వారిని బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అది తప్ప టీడీపీకి మరో విధంగా కౌంటర్ ఇచ్చే ఆలోచనలు చేయలేపోతున్నారు. చేసినా జనంలోకి పంపించేందుకు క్యాడర్ లేకుండా పోయింది. కరెంట్ చార్జీలపై విస్తృతంగా వ్యతిరేక ప్రచారం జరుగుతూంటే.. .. వాడుకున్నారు కాబట్టే వచ్చిందనే వింత వాదన చేస్తూ.. ప్రజల్లో వైసీపీపై మరింత ఆగ్రహం పెంచుతున్నారు సోషల్ మీడియా కార్యకర్తలు. మొత్తంగా పార్టీ క్యాడర్ ను కూడా పీల్చి పిప్పి చేసి… ఇప్పుడు మళ్లీ సీఎంను చేయాలంటే ఎలా సాధ్యమన్న వాదన ఆ పార్టీలో వినిపిస్తోంది.