ఉన్నత చదువులు చదివిన వ్యక్తిగా.. విజయసాయిరెడ్డికి.. రాజకీయాల్లో రాక ముందు వరకూ.. ఓ గుర్తింపు ఉండేది. ఆయనకు చాలా సంస్కారం ఉంటుందని… అనుకునేవాళ్లు. కానీ.. రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు…చదువు అబ్బింది కానీ.. సంస్కారం అబ్బలేదన్న విషయం.. ఆయన మాటల ద్వారా తరచూ బయట పెట్టుకుంటూ ఉంటారు. తాజాగా.. తనకు రివర్స్ కౌంటర్లు వస్తాయని.. తెలిసి కూడా.. ఆయన ట్వీట్లు ఏ మాత్రం మానుకోవడం లేదు. చింతమనేని ప్రభాకర్ వీడియో మార్ఫింగ్ కేసులో… కొంత మంది వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. అలా అరెస్ట్ చేయడం .. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ.. ఓ లాజిక్ బయటకు తీసి.. దాన్ని ట్వీట్ రూపంలో పెట్టి.. తాను కూడా.. ఆ వీడియోను.. ట్వీట్ చేస్తున్నానని.. దమ్ముంటే.. చర్యలు తీసుకోవాలని సవాల్ కూడా చేశారు. ఆ ట్వీట్ చూసి.. వైసీపీ నేతలే… ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఎందుకంటే.. కొద్ది రోజుల క్రితం.. జగన్ సోదరి షర్మిల.. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని… దాని వెనుక టీడీపీ ఉందని.. తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
షర్మిల ఫిర్యాదుపై… అఘమేఘాలపై స్పందించిన తెలంగాణ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అసలు ఆ వీడియోల సృష్టికర్తలెవరో.. తెలుసుకోవడం క్షణాల్లో పని. అది మాత్రం చేయకుండా.. ఎవరో.. ఇద్దరు కుర్రాళ్లు… ఆ వీడియోల కింద అసభ్య కామెంట్లు చేశారని అరెస్ట్ చేసి.. సైలెంటయిపోయారు. ఇప్పుడా కేసు ఎక్కడ ఉందో కూడా తెలియదు. కానీ.. ఆ కేసుకు అంత ప్రాధాన్యం ఇచ్చిన వైసీపీ నేతలకు కానీ… పోలీసులకు కానీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినంతనే… అరెస్ట్ చేయకూడదనే… సుప్రీంకోర్టు తీర్పు గుర్తు కాలేదా..? లేక అప్పట్లో విజయసాయిరెడ్డికి తెలిసిన విషయం కూడా ఎవరికీ తెలియదా..? అన్న కామెంట్లు… సోషల్ మీడియాలో గట్టిగానే పడుతున్నాయి.
నిజానికి ట్విట్టర్లో విజయసాయిరెడ్డి పోస్టులు చూస్తూంటే.. అది అసలు ఆయన అకౌంటేనా.. ఆయన చదువుకి.. ఆయన పర్సనాలిటీకి.. ఆయన పదవికి.. ఆయన వయసుకి… సరిపడే ట్వీట్ ఒక్కటంటే ఒక్కటీ ఉండదు. ఎంపీ హోదాలో.. వెరీఫైడ్ అకౌంట్ పెట్టుకుని… ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేని సోషల్ మీడియా కార్యకర్తలు చేసే కామెంట్లు తరహాలో.. ఆయన ట్వీట్లు ఉంటాయి. దానికి ట్రోలింగ్స్ వచ్చినా ఆయన వెనుకడుగు వేయరు.
ట్వీట్లు,ఫేస్బుక్ సాకుగా అరెస్ట్లు చేయొద్దంటూ 2015లోసుప్రీంకోర్టు తీర్పు కూడా తెలియని మీరేం ఐటీ మంత్రి లోకేషూ!ఆ రూలు వర్తింపచేస్తే మీ ట్వీట్లకు రోజుకు ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి?మీ డాడీ షాడో నుంచి బైటకు రా.చింతమనేని దళితులను దూషించే వీడియో పోస్ట్ చేస్తున్నాను. చర్యలు తీసుకోండి. pic.twitter.com/XO7Eb9Gdeh
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 24, 2019