సమంత రాజకీయాల్లోకి రానున్నారా? ఇప్పుడు తమిళనాడులో ఇదే హాట్ టాపిక్. టాపిక్ హాటే. కానీ సమంత వచ్చేది మాత్రం రియల్ పాలిటిక్స్ లోకి కాదు. రీల్ పాలిటిక్స్ లోకి. పొలిటికల్ ఫాంటసీ చిత్రం `తుగ్లక్ దర్బార్`లో సమంత నాయికగా నటించనున్నట్టు సమాచారం. విజయ్ సేతుపతి హీరోగా నటించనున్న సినిమా అది. సీరియస్ పాలిటిక్స్ గురించి కాకుండా, పొలిటికల్ ఫాంటసీగా తెరకెక్కించనున్నారు డెబ్యుటెంట్ డైరక్టర్ ఢిల్లీ ప్రసాద్ దీనదయాల్. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేయాలన్నది నిర్మాత సెవన్ స్క్రీన్ స్టూడియో లలిత్ కుమార్ ప్లాన్ అట. ఇప్పుడు `సైరా`తో విజయ్ సేతుపతి గురించి తెలుగువారికి కూడా బాగా తెలిసింది. సో ఇక్కడి మార్కెట్‌ను కూడా అందిపుచ్చుకోవడానికి నిర్మాత ప్లాన్ చేస్తున్నారట. అందుకే ప్రస్తుతం విజయ్ సేతుపతి సరసన `సూపర్ డీలక్స్` చిత్రంలో నటిస్తున్న సమంతనే `తుగ్లక్ దర్బార్` కోసం సంప్రదిస్తున్నారట. అయితే సమంత ఓకే చెప్పారా? లేదా? అనేది వేచి చూస్తేనే తెలుస్తుంది.