వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. బీజేపీతో దగ్గర సంబంధాలున్నాయని.. రాజకీయాల్లో ఉన్న వారందరికీ తెలుసు. ఢిల్లీలో బీజేపీ నాయకత్వానికి… వైసీపీ నాయకత్వానికి అనుసంధాన కర్తగా.. విజయసాయిరెడ్డి ఉంటారు. ఆయన ఎక్కువగా పీఎంవో కార్యాలయంలోకనిపిస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనను దొంగ లెక్కల ఆడిటర్ గా పిలుస్తూంటారు. జగన్మోహన్ రెడ్డి.. అక్రమ ఆస్తుల మాస్టర్ ప్లాన్ మొత్తం విజయసాయిరెడ్డిదేనని… చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు.. ఆయన అనుభవాన్ని… భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఉపయోగించుకున్నారా… అంటే.. అవుననే అంటున్నారు.. టీడీపీ నేతలు. రాజ్యసభ ఎంపీ కనకమేడల రవింద్ర కుమార్ .. ఈ విషయంలో కొన్ని సంచలనాత్మక ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డికి ఉన్న ఆడిటింగ్ దొంగ తెలివి తేటల్ని కాగ్ రిపోర్ట్ ను.. మ్యానిపులేట్ చేయడంలో… బీజేపీ అగ్రనాయకత్వం వాడుకున్నదనేది.. ఆయన చేస్తున్న ఆరోపణ. ఇది తాను చెబుతున్నది కాదని.. ఢిల్లీలో అందరూ అనుకుంటున్నదేనని కనకమేడల నమ్మకంగా చెబుతున్నారు.
రాఫెల్ పై కాగ్ రిపోర్ట్… దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. ముందు నుంచి ఈ రిపోర్ట్ పై అనేక అనుమానాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఈ రిపోర్టును పీఎంవోనే రెడీ చేస్తోందని.. అందుకే అది చౌకిదార్ ఆడిటర్ రిపోర్ట్ అని విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. దానికి తగ్గట్లుగానే.. కాగ్.. రిపోర్ట్ లో… కేంద్రానికి అనుకూలంగా రాసుకొచ్చారు. అందులో ఉన్న ఎన్నో అంశాలపై.. నిపుణులు విశ్లేషణ చేసి.. విమర్శలు చేస్తున్నారు కానీ.. రేటు విషయంలో.. అసలు రేటు ఎంతో చెప్పకుండా.. 2.8 శాతం తక్కువ ఉందని.. సర్టిఫికెట్ ఇచ్చారు. ఇదే అనేక అనుమానాలకు తావిస్తోంది.
ప్రధానమంత్రి కార్యాలయంలోనే… కాగ్ రిపోర్ట్ కు ఎడిటింగ్ జరిగిందని.. ఆ ఎడిటింగ్ చేసిన ఆడిటర్ విజయసాయిరెడ్డేనని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.కాగ్ నివేదికను తప్పుదోవ పట్టించడంలో.. ఆడిటర్ అయిన విజయసాయిరెడ్డి సహాయపడ్డారని కనకమేడల చెప్పుకొచ్చారు. పీఎంవోలో ఉన్న సన్నహిత సంబంధాల నేపధ్యంలో.. విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు చేసిన ఈ ఆరోపణల్లో.. పెద్దగా… అనుమానించాల్సిందేమీ లేదని.. ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఆడిటర్ గా.. వైఎస్ హయాంలో.. విజయసాయిరెడ్డి పేరును.. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పోస్టుకు కూడా సిఫార్సు చేసినట్లు ప్రచారం జరిగింది. అంత అనుభవం ఉన్న నేత.. ఓ కాగ్ రిపోర్టును ఎడిటింగ్ చేయడంతో సహకరించి ఉండటంతో వింతేమీ ఉండకపోవచ్చు.