అధికారం ఉందని చెలరేగిపోయిన ఓ వర్గం పోలీసుల వ్యవహారాశైలి ఏ మాత్రం మారడం లేదు. తమ వర్గ దేవుడు అయిన వైఎస్ పేరును తీసేస్తారా అంటూ రెచ్చిపోతున్నారు. విజయవాడలో విధులు నిర్వహిస్తున్న మురళీకృష్ణారెడ్డి అనే ఏసీపీ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఊరూవాడా… పార్కుల నుంచి టాయిలెట్లవరకూ దేన్ని వదలకుండా వైఎస్ఆర్ పేరు పెట్టారు. టాయిలెట్లకు పెట్టుకుంటే పెట్టుకున్నారు కానీ ప్రజాధనంతో నిర్మించిన పార్కులు.. ఇతర వాటికి వైఎస్ఆర్ పేరు ఎందుకని కొంత మంది టీడీపీ కార్యకర్తలు వాటిని తీసేయడం ప్రారంభించారు. విజయవాడ భవానీపురంలో ఓ పార్కుకు ఉన్న వైఎస్ఆర్ పేరును టీడీపీ కార్యకర్తలు తొలగించారు. వెంటనే.. ఏసీపీ మురళీకృష్ణారెడ్డికి మంట పుట్టింది. ఆయన తమ వర్గ దేవుడు అని.. ఆయన పేరును తొలగిస్తారా అని కేసులు పెట్టేశారు.
ఒకటి కాదు.. రెండు కాదు… మొత్తం ఆరు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మూడు డివిజన్ల టీడీపీ నేతలను ఇరికించారు. తాను స్వయంగా వచ్చి టీడీపీ నేతల్ని బూతులు తిట్టారు. మురళీకృష్ణారెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఆయనపై చర్యలు తీరుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
ఏపీలో ఎక్కడ చూసినా ఒకే వర్గం పోలీసులు కనిపిస్తూ వచ్చారు. డీఎస్పీలు,ఏసీపీ, సీఐలు… ఎస్ఐలు కూడా కీలకమైన స్థానాల్లో ఒకే వర్గం వారు ఉన్నారు. ఇప్పుడు అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చి.. వ్యవస్థను చక్కదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.