తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ పెట్టేశారు. ఎందుకు అంత తొందరపడ్డారో కానీ.. ఆయన వైసీపీని వదిలేస్తే.. ఏ పార్టీ అయినా చేర్చుకుంటుందా అంటే.. గట్టిగా చెప్పలేని పరిస్థితి. టీడీపీ రానివ్వదు. బీజేపీ అడుగు పెట్టనివ్వదు. జనసేన గేటు వద్దకూ ఎంట్రీ ఉండదు. ఒక వేళ ఆయన ఏదైనా పార్టీలో చేరిన ఆయన నిరర్థక ఆస్తిలా పడి ఉంటారు. ఆయన వల్ల ఒక్క ఓటు కూడా కలసి రాదు.. పైగా ఎంతో నష్టం.
విజయసాయిరెడ్డి సూట్ కేసు కంపెనీలకు… తెర వెనుక కుట్రలకు.. బూతు ట్వీట్లకు మాత్రమే ఉపయోగం. అవి జగన్ కు తప్ప ఇంకెవరికీ పనికి రావు. ఆయన రాజకీయాన్ని ఏ పార్టీ కూడా హర్షించదు. అందుకే ఆయన వైసీపీని వీడితే ఎందుకూ పనికిరారు. కానీ జగన్ అక్రమాస్తుల కేసుల్లో అప్రూవర్ గా మారేందుకు సిద్ధమైతే మాత్రం… కొంత మంది ప్రోత్సహించే అవకాశం ఉంది. జగన్ రెడ్డి గుట్టు మొత్తం ఆయనకు తెలుసు.. ఇంకా చెప్పాలంటే అన్ని ఆయన చేతుల మీదుగానే నడిచాయి. ల
గత ఐదేళ్ల కాలంలో జరిగిన ఆర్థిక అవకతవకల్లోనూ ఆయన పాత్ర ఎక్కువగానే ఉంది. విజయసాయిరెడ్డి నిజంగా తాను వైసీపీలో ఉండదల్చుకోలేదని అనుకుంటే… జగన్ పై కోపం ఉంటే… ఆయన పై కేసుల్లో అప్రూవర్ గా మారి అన్ని ఆధారాలు బయటపెడితేనే అందరూ నమ్ముతారు. అంతే కానీ.. ఎవరూ అడగకపోయినా తాను వైసీపీని వీడటం లేదని చెప్పుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు.