ఉల్చా చోర్ కొత్వాల్ కో డాంటే అని వైసీపీ నేతల్ని చూసే అని ఉంటారు . ఇష్టం వచ్చిటన్లుగా ప్రజల్ని దోపిడీ చేస్తూ… ప్రశ్నిస్తున్న వారిపై దారుణమైన నిందలు వేస్తున్నారు. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా కూడా వదిలి పెట్టడం లేదు. వైసీపీ అవినీతిని ప్రశ్నిస్తున్న పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి నిన్నామొన్నటిదాకా .. వ్యక్తిగత, కుటుంబపరమైన విమర్శలు చేసేవారు. తాజాగా ఆమె అవినీతి చేసిందంటూ చెప్పుకొచ్చారు. అయితే అలా చెప్పినవే కామెడీగా ఉన్నాయి.
ఎయిరిండియాను టాటాలు కొనుగోలు చేశారు. ఆ డీల్ లో పురందేశ్వరికి లంచం ఇచ్చారట. పురందేశ్వరి ఓ కమిటీలో మెంబర్ గా మాత్రమే ఉన్నారు. ఆ కమిటీకి ఎయిర్ ఇండియా అమ్మకంపై ఎలాంటి అజమాయిషీ ఉండదు. అదంతా ప్రత్యేకమైన ప్రక్రియ. నిజానికి ఎయిర్ ఇండిాయను ఎవరూ కొనుగోలు చేయకపోతే రిస్క్ తీసుకుని టాటా తీసుకుదంని ప్రపంచం అంతా తెలుసు. అయినా టాటాల దగ్గర డబ్బులు తీసుకున్నారని పురందేశ్వరి నిందలేస్తున్నారు. అసలు టాటాలు పురందేశ్వరికి లంచం ఎందుకిస్తారనేదే పెద్ద సస్పెన్స్. ఇంత కామెడీ ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి… హైదరాబాద్ పురందేశ్వరి విల్లా కడుతున్నారని అదని.. ఇదని ఆరోపణలు చేశారు అంటే తాము అవినీతి పరులం కాబట్టి ఇతరులపైనా గాసిప్స్ క్రియేట్ చేసి.. వాటినే ప్రచారం చేసి..మీడియాలో చెబితే నమ్మేవాళ్లు నమ్ముతారని విజయసాయిరెడ్డి ఉద్దేశం.
పురందేశ్వరి రేపోమాపో.. విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులోన పిటిషన్ వేయబోతున్నారు. ఇప్పటికే సీజేఐకి లేఖ రాశారు. ఈ క్రమంలో ఆమెపై వైసీపీ నేతల దాడి పెరిగింది. వారి అవినీతిని ప్రశ్నిస్తే.. టీడీపీనే అన్నట్లుగా పురందేశ్వరిపై విమర్శలు ప్రారంభిస్తున్నారు. పురందేశ్వరికి అండగా హైకమాండ్ ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.