అఖిల్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ఏజెంట్`. మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. `ఏజెంట్` కొంతమేర షూటింగ్ జరిగింది. అయితే జరిగినదాంట్లోనే మళ్లీ రీపేర్లు మొదలయ్యాయి. సురేందర్ రెడ్డికి కరోనా సోకడంతో.. `ఏజెంట్` షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ గ్యాప్‌లో స్క్రిప్టుని ఇంకాస్త పకడ్బందీగా తీర్చిదిద్దే క్రమంలో కొన్ని మార్పులు, చేర్పులూ చేశారు. అందులో భాగంగా.. విలన్ పాత్రధారిని మార్చేశారు.
ఈ సినిమా కోసం ఇది వరకు బాలీవుడ్ విలన్ ని తీసుకొచ్చారు. తనపై కొన్ని సీన్లు తెరకెక్కించారు. అయితే… అతని స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చకపోవడంతో, ఇప్పుడు ఆ విలన్ ని పక్కన పెట్టి, మరో విలన్ ని తీసుకొనే పనిలో పడ్డారు. కొత్త విలన్ వచ్చాక… పాత విలన్‌పై తీసిన సీన్లన్నీ రీషూట్ చేయాల్సివస్తుంది. షూటింగ్ కొంత మేరే జరిగింది కాబట్టి… రీప్లేస్మెంట్ జరిగినా, పెద్ద నష్టమేం లేదు. కొన్ని షాట్లు… రీషూట్లు చేస్తే చాలు. అదే సగం సినిమా అయిపోయాక.. `విలన్ స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చలేదు` అనుకుంటే.. ఏమైపోదునో..?