వినేష్ ఫోగట్… రెజ్లింగ్ సమాఖ్యలో కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమంలో గట్టిగా వినపడ్డ పేరు. ఆ తర్వాత మొన్నటి ఒలంపిక్స్ లో ఇండియాకు మెడల్ ఖాయం అనుకున్న దశలో కేవలం 100గ్రాముల బరువు అధికంగా ఉండటంతో ఆట నుండి తప్పుకోవాల్సి వచ్చింది. పతకం గెలవకున్నా, దేశం అంతా తనకు అండగా నిలబడింది.
అయితే, ఒలంపిక్స్ లో జరిగిన దానికి తీవ్ర నిరాశతో ఆటకు గుడ్ బై చెప్పిన వినేష్… గత వారం కాంగ్రెస్ లో చేరింది. హర్యానాలో ప్రస్తుతం అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆమె టికెట్ తెచ్చుకున్నారు.
తాజాగా నామినేషన్ వేసిన అఫిడవిట్ లో వినేష్ ఆస్తుల వివరాలు వెల్లడించారు. మొత్తం నాలుగు లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలిపారు. నాలుగు కోట్లకు పైగా స్థిర, చరాస్తులు ఉన్నాయని పేర్కొనగా, వినేష్ వద్ద 35గ్రాముల బంగారం ఉందని ప్రకటించింది. ఇక తన భర్తకు స్కార్పియో కారుతో పాటు 28గ్రాముల బంగారం తన వద్ద ఉందని తెలిపింది.
ఇక వీరిద్దరికి కలిపి బ్యాంకుల్లో 69లక్షల డిపాజిట్లు ఉండగా… వినేష్ పేరు మీద ఉన్న వోల్పో 60, క్రెటా, ఇన్నోవా కార్లలో ఇన్నోవా కారుకు బ్యాంకులోన్ ఉందని, ఆ లోన్ ఇప్పుడు కడుతున్నట్లు అధికారికంగా పేర్కొన్నారు.