రన్ మెషీన్ కింగ్ కోహ్లీ బర్త్ డే ఈ రోజు. ఈ సందర్భంగా తన అభిమానులకు సెంచరీతో అపురూపమైన కానుక ఇచ్చేశాడు. ఈడెన్ గార్డెన్ లో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో అజేయ సెంచరీతో అలరించాడు. సరిగ్గా 101 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇది కోహ్లీ కెరీర్లో 49వ సెంచరీ. దాంతో సచిన్ (49) సరసన నిలిచాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ పేరుమీద ఉన్న సంగతి తెలిసిందే. సచిన్ 463 మ్యాచ్‌లు ఆడి, సచిన్ 49 సెంచరీలు చేస్తే… కోహ్లి కేవలం 288 మ్యాచ్‌లతోనే ఆ ఘనత సాధించాడు. ఈ వరల్డ్ కప్‌లోనే కోహ్లీ.. 50 సెంచరీల రికార్డు చేరుకొన్నా ఆశ్చర్యం లేదు.
సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 326 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (40) దూకుడుగా ఆడాడు. శ్రేయాస్ అయ్యర్ (77) మరోసారి నిలకడైన ఆట తీరు ప్రదర్శించాడు. చివర్లో జడేజా (29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికాలు సెమీస్ చేరాయి. ఈ మ్యాచ్ నామమాత్రమే అయినప్పటికీ, పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కాలంటే.. ఇరు జట్లకూ ఈ మ్యాచ్ లో గెలవడం కీలకం.