విశ్వక్ సేన్ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ సబ్జెక్ట్ ఏమిటనేది చివరివరకూ చెప్పలేదు. ప్రెస్ మీట్ మొదలైయ్యాక తన నిర్మాణంలో ఓ కొత్త సినిమాని టైటిల్ ని అనౌన్స్ చేశారు. అదే.. #కల్ట్. ఇదొక క్రైమ్ కామెడీ. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథని రాసుకున్నారట విశ్వక్ సేన్. దాదాపు పాతిక మంది కొత్త నటీనటులకు ఇందులో అవకాశం ఇస్తున్నారు. దర్శకుడు కూడా కొత్తే. తనతో ఎంతో కాలంగా ప్రయాణిస్తున్న తాజుద్దిన్ కి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చాడు విశ్వక్ .అంతా బావుంది కానీ టైటిల్ దగ్గరే అసలు సమస్య మొదలైయింది.
‘కల్ట్ బొమ్మ’ అనే టైటిల్ ని ఇటివలే అనౌన్స్ చేశారు నిర్మాత ఎస్కేన్. ఇప్పుడు అదే టైటిల్ లో బొమ్మ తీసేసి ‘కల్ట్’ అని ప్రకటించాడు విశ్వక్ సేన్. దాదాపు ఏడాది క్రితం నుంచి ఈ టైటిల్ డిజైన్ చేసుకున్నాడట. అయితే ఈ రెండూ టైటిల్స్ ఒకటే కావడంతో నిర్మాణ ఎస్కేన్ కి ఫోన్లు వెళ్ళాయి. రిజిస్టర్ చేయకుండా టైటిల్ ని ప్రకటించారా? అని కొందరు ఆరా తీశారు. దీంతో ఎస్కేన్ స్పందించారు.
”బేబీ సినిమా ప్రమోషన్స్ లో ‘కల్ట్ బొమ్మ అనే మాటకు ఎంత ప్రచారం వచ్చిందో అందరికీ తెలుసు. నా తర్వాత సినిమాకి అదే టైటిల్ ప్రొడ్యుసర్ కౌన్సిల్ లో ముందే రిజిస్టర్ చేశాను” అని తనవంతు వివరణ ఇచ్చారు ఎస్కేన్. మొత్తనికి ఒకే టైటిల్ తో రెండో సినిమాలు తయారౌతున్నట్లే. ఈ రెండిట్లో కల్ట్ అనే మాట కామన్. టైటిల్ లో క్యాచినెస్ ఆ పదంలోనే వుంది. మరి ఈ రెండిట్లో ఎవరి కల్ట్ ముందోస్తుందో చూడాలి.