విశాఖ కార్పొరేషన్లో వైసీపీ బలం కోల్పోయినట్లుగా తేలిపోయింది. పది స్టాండింగ్ కమిటీలకు జరిగిన ఎన్నికల్లో కూటమికి చెందిన పది మంది కార్పొరేటర్లు విజయం సాధించారు. దీంతో వైసీపీకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇతర పార్టీల్లో చేరకుండా ఉన్న కొద్ది మంది వైసీపీ సభ్యులు.. ఫలితాలను ప్రకటించవద్దని రచ్చ చేశారు. పెన్సిల్తో మార్కింగ్ చేయించిన ఓట్లు చెల్లవని వాదించారు. 12 నుంచి 16 ఓట్లు తొలగించి, మిగతా ఓట్లు లెక్కించాలని డిమాండ్ చేశారు. అయితే అలాంటి తెలివితేటలు అందరికీ ఉంటాయని భావించిన అధికారులు పోలైన ఓట్లను లెక్కించి విజేతల్ని ప్రకటించారు.
విశాఖ కార్పొరేషన్లో ఎన్నికలకు ముందు.. త్రవాత పెద్ద ఎత్తువ కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరిపోయారు. వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు సీతంరాజు సుధాకర్ వంటి నేతలు పార్టీని గుడ్ బై చెప్పారు. వారితో పాటు పెద్ద ఎత్తున కార్పొరేటర్లు కూడా వెళ్లారు. అలాగే అలాగే ఫలితాలు వచ్చిన తర్వాత మరికొంత మంది ఇతర పార్టీల్లో చేరిపోయారు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి ఫలితం రావడం వైసీపీకి షాకే.
Also Read : విలువలు… విశ్వసనీయత… జగన్ మళ్లీ మొదలుపెట్టారు
మరో వైప వైసీపీకి గుడ్ బై చెప్పేకీలక నేతలుగా పెద్ద ఎత్తున పెరుగుతున్నారు. ఉదయం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు గుడ్ బై చెప్పగా.. సాయంత్రానికి అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య దండం పెట్టేశారు. వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటిచారు. మొత్తంగా వైసీపీ ఒక్క సారిగా డ్రై అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.