కంటెయినర్ నిండా డ్రగ్స్… అది కూడా అత్యంత ఖరీదైన కొకైన్ లాంటి వాటితో ఇండియాకు వచ్చింది. విశాఖ పోర్టులో పట్టేసుకున్నారు. ఇంటర్ పోల్ సాయంతో పట్టేసుకున్నామని సీబీఐ ఘనంగా ప్రకటించింది . కానీ ఇది జరిగి నెలలు దాటిపోతోంది. పట్టుకున్నామన్న సమాచారం తప్ప.. ఎవరు రప్పించారు.. ఎందుకు దిగుమతి చేశారు.. వాటితో ఏం చేస్తారు .. అసలు ఈ అంతర్జాతీయ మాఫియాలో లింకులున్న తెలుగువారెవరు అన్న దానిపై తదుపరి సమాచారమే లేదు.
డ్రగ్స్ కంటెయినర్ కు.. కేంద్ర బలగాలతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే ఈ కేసులో ఒక్క అరెస్టు కూడా జరగలేదు. ఈ కేసులో రాజకీయ దుమారం రేగింది. డ్రగ్స్ తెచ్చింది మీరంటే మీరని రాజకీయ విమర్శలు చేసుకున్నారు. వైసీపీలో ఉన్నా.. ఓ కులం వారు కాబట్టి… డ్రగ్స్ తెచ్చింది బీజేపీ, టీడీపీనేనని వాదించుకున్నారు. తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు సీబీఐ కూడా ఏమీ చెప్పడం లేదు. మాజీ ఎంపీ హర్షకుమార్ మూడురోజు కిందట ప్రెస్ మీట్ పెట్టి ఆ డ్రగ్స్ విషయంలో మోదీకి సంబంధాలు ఉండవచ్చని అందుకే సీబీఐ ఏమీ చెప్పడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.
డ్రగ్స్ కంటెయినర్ ఏమయింది… ఇంకా సీబీఐ అదుపులోనే ఉందా.. బ్రెజిల్ కూడా వెళ్లి దర్యాప్తు చేశారని అంటున్నారు దాని గురించి సమాచారం ఏమిటి.. ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సి ఉంది. లేకపోతే.. అనేక రకాల అనుమానాలకు కారణం అయ్యే అవకాశం ఉంది. ఒక వేళ అందులో డ్రగ్స్ లేవని.. తాము పొరపడ్డామని అనుకుంటే.. అదే విషయాన్ని అయినా చెబితే ప్రజలకు క్లారిటీ వస్తుంది.కానీ సీబీఐ ఏదీ చెప్పడం లేదు.