విశాఖలో మెడ్ టెక్ జోన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మంకీపాక్స్ వైరస్ టెస్ట్ కిట్ ను రిలీజ్ చేసింది. ట్రెన్సేషియా కంపెనీ భాగస్వామ్యంతో మెడ్‌టెక్ జోన్ ఈ ఆర్టీపీసీఆర్ కిట్ ను రూపొందించింది. మెడికల్ కౌన్సిల్ తో పాటు అన్ని రకాల వైద్య సంబంధ అనుమతల ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. ఈ టెస్ట్ కిట్ ఆవిష్కరణతో ప్రపంచంలో వైద్య రంగంలోని మార్పులకు తగ్గట్లుగా నూతన ఆవిష్కరణలు చేపట్టడంలో విశాఖ మెడ్ టెక్ జోన్ ముందంజలో ఉన్నట్లుగా స్పష్టమయింది.
విశాఖ మెడ్ టెక్ జోన్.. గతంలో కరోనా సమయంలోనూ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ల ఉత్పత్తిలో రికార్డు సృష్టించింది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అనేక రకాల మెడికల్ ఎక్విప్ మెంట్లు మెడ్ టెక్ జోన్ నుంచి ఉత్పత్తి అయ్యాయి. ఇక్కడ తయారవుతున్న కొత్త ఉత్పత్తులు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. త్వరలో మెడ్ టెక్ యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి.
విశాఖ మెడ్ టెక్ జోన్ చంద్రబాబు ఆలోచనల మేరకు.. జితేందర్ శర్మ అనే అధికారి ముందుకు తీసుకెళ్తున్నారు. టీడీపీ ఓడిపోయిన తర్వాత ఈ మెడ్ టెక్ జోన్ పీక నులిమేయడానికి ప్రయత్నించారు. జితేందర్ శర్మపై తప్పుడు కేసులు పెట్టి ఆయనను అక్కడ్నుంచి పంపేయాలనుకున్నారు. కానీ అంతర్జాతీయ కంపెనీలు సైతం నిరసన వ్యక్తం చేసి కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో మళ్లీ జితేందర్ శర్మను అక్కడ నియమించక తప్పలేదు. చంద్రబాబు మరోసారి గెలిచిన తర్వాత మెడ్ టెక్ జోన్ లో మరితం ప్రోత్సాహకరవాతవరణం కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఓ సారి జోన్ లో పర్యటించారు.