ఆన్ డ్యూటీ రాజధాని పేరు ఎప్పుడైనా విన్నారా..? పన్నెండో తేదీ నుంచి వినొచ్చు. ఆ రోజున జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కొన్ని శాఖల కార్యాలయాలను ఆన్ డ్యూటీ పేరుతో… విశాఖకు తరలించడానికి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. తరలింపు ఆలస్యమయ్యే కొద్దీ… చిక్కు ముళ్లు పడిపోతున్నాయని ఆందోళన చెందుతున్న ప్రభుత్వం… ఎంత త్వరగా.. కార్యాలయాలను తరలిస్తే..అంత మంచిదని భఆవిస్తోంది. కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్, విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలన్న ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
అలాంటి పరిస్థితి రాకుండా.. అన్ డ్యూటీ పేరుతో సచివాలయంలోని కొన్ని కీలక శాఖల ఉద్యోగులను విశాఖపట్నానికి తరలిస్తే ఎలా ఉంటుందన్నదానిపై ఇప్పటికే న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని శాఖలను విశాఖపట్నం తరలిస్తే న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయన్నదానిపై… ప్రభుత్వ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. కార్యాలయాలను తరలించే విషయంలో హైకోర్టులు.. ఏ చట్టం ప్రకారమూ అడ్డుకోలేవని.. పరిపాలనా సౌలభ్యం… ఆన్ డ్యూటీ అని చెబితే.. కోర్టులు అస్సలు అభ్యంతరం చెప్పవని.. ప్రభుత్వానికి న్యాయనిపుణులు సూచించినట్లుగా చెబుతున్నారు.
ఈ అంశంపైనే ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటే తిరుగుండదని భావిస్తున్నారు. ఇప్పటికే.. వికేంద్రీకరణ ప్రక్రియ ప్రారంభమైందని..న్యాయపరమైన చిక్కులు ఉన్నా.. ఆగబోమని .. మంత్రి బొత్స నేరుగానే ప్రకటించారు. 12వ తేదీ తర్వాత అమరావతి వేదికగా మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.