ఎన్నికల విధుల్లో సాధారణం ఎవరు ఉంటారు ? ఎక్కువగా టీచర్లు ఉంటారు. కానీ ఏపీ ప్రభుత్వం ఎన్నికల విధుల్లో ఇక టీచర్లు ఉండకుండా చేయనుంది. ఇందు కోసం చట్టం చేయాలని సంకల్పించింది. టీచర్లకు బోధనేతర విధులు ఇవ్వకుండా చట్టం చేయనున్నారు. ఈ ప్రకారం ఇక టీచర్లకు ఎన్నికల విధులు కేటాయించడం ఈసీకి కూడా సాధ్యం కాదంటున్నారు. అయితే ఇలాంటి చట్టం చేయవచ్చా .. చేసినా… ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకోవడం.. బోధనేతర విధి అవుతుందా .. అనేదానిపై క్లారిటీ లేదు.. కానీ ప్రభుత్వం మాత్రం ముందుకెళ్లాలనుకుంటోంది.
ప్రభుత్వ ఉద్యోగులను… జగన్ సర్కార్ దారుణంగా మోసం చేసింది. టీచర్లు అయితే పూర్తి స్థాయిలో అన్యాయమైపోయారు. అనేక రకాలుగా వేధిస్తున్నారు కూడా. అందుకే వారు తమకు వ్యతిరేకంగా ఉంటారన్న ఉద్దేశంతో వారిని ఎన్నికలకు విధులకు దూరంగా ఉంచాలని జగన్ సర్కాన్ ప్లాన్ చేస్తోంది. అయితే వారు లేకపోతే సిబ్బంది సమస్యలను ఎలా అధిగమించాలన్నదానిపైనా ప్రభుత్వానికి ప్లాన్ ఉంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాయాల వాలంటీర్లు చాల మందికి ప్రొబేషన్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. వారినే ఎన్నికల విధులకు కేటాయించాలే చూసుకోనున్నారు. ఈసీకి మరో ప్రత్యామ్నాయం లేకుండా… వారినే ఉపయోగించుకునేలా ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు.
ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు… వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లే వచ్చే ఎన్నికల్లో కీలకమని చెబుతూ వస్తున్నారు. ప్రభుత్వం చివరికి అదే చేస్తోంది. ఇదే జరిగితే.. వచ్చే ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి టీచర్లు వ్యతిరేకం కాబట్టి వారిని ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చేయడం అనే ఆలోచనలోనే దుర్బుద్ది ఉందని…ఇలాంటి ఆలోచనలు ఉన్న ప్రభుత్వం… తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించడం చేయకుండా ఎలా ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.