టీఆర్ఎస్లో చేరినా సండ్ర వెంకట వీరయ్యకు ఓటుకు నోటు కేసులో గుడ్ న్యూస్ లభించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆప్తుడిగా ఇటీవలి కాలంలో సండ్ర వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ.. ఆయనకు వ్యతిరేకంగా ఏసీబీ … కోర్టులో గట్టిగా వాదించింది. ఓటుకు నోటు కేసులో ఆయన పాత్ర ఉందని చెబుతోంది. దీంతో ఆ కేసు నుంచి తనను తప్పించాలని .. క్వాష్ పిటిషన్ వేసిన సండ్రకు కోర్టులో షాక్ తగిలింది. సండ్ర పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా .. నామిేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ రేవంత్ రెడ్జి ఏసీబీకి చిక్కారు.
ఆ కేసులో.. సండ్ర ప్రమేయం ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ హోటల్లో ఎమ్మెల్సీ అభ్యర్థితో సమావేశమయ్యారని.. సండ్రకు కుట్ర గురించి మొత్తం తెలుసని సాక్ష్యాలున్నాయని ఏసీబీ వాదిస్తోంది . ఆయనను అరెస్ట్ కూడా చేశారు. కొన్నాళ్లు జైలులో ఉండి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా టీడీపీలోనే కొనసాగారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచి… టీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారు. దీంతో ఆయనపై కేసు తేలిపోతుందని అనుకున్నారు.
అయితే క్వాష్ పిటిషన్లోనే ఏసీబీ ఆయనకు షాకిచ్చింది. సండ్రతో పాటు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పడిన ఉదయసింహా వసిన క్వాష్ పిటిషన్ను కూడా.. ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. ప్రజాప్రతినిధుల కేసులపై రోజువారీ విచారణలో భాగంగా… పెండింగ్ కేసులన్నింటినీ న్యాయస్థానాలు రోజువారీ విచారణ చేపడుతున్నాయి.