చిరంజీవి 150 వ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ బయటకు వచ్చేసింది. అయితే డైలాగులేమీ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. అయితే.. వినాయక్ ఆ లోటు తీర్చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన ఓ డైలాగ్ వదిలి ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు. చిరంజీవి 61వ పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ ఈ సినిమాలోని డైలాగ్ లీక్ చేసేశాడు.
ఓ సందర్భంలో – మా వాళ్లనే కొడతావా, హీరో అనుకొన్నావా? ఏంటి నీ పొగరు..?? అని విలన్ చిరంజీవిని అడిగితే… ”పొగరు నా ఒంట్లో ఉంటుంది. హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది” అనే డైలాగ్ వదులుతాడట చిరంజీవి. ఇలాంటి డైలాగులు ఈ సినిమాలో చాలా ఉన్నాయని వినాయక్ అభిమానుల్ని ఊరిస్తున్నాడు. చిరంజీవి ఈ సినిమాలో చాలా యంగ్‌గా కనిపిస్తాడని, ఆయన వయసు 61 కాదని, 21 అని చమత్కరించాడు. చిరు సెట్లో చాలా ఎనర్జిటిక్ గా ఉన్నారని, ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టడం ఖాయమంటున్నాడు వినాయక్.