డేరాబాబా గురించి కథలు కథలుగా దేశమంతా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన నిర్దోషి అని హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. తన మాజదీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ నిర్దోషి అని పంజాబ్ హర్యానా హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చింది.
డేరా బాబా దగ్గర మేనేజర్‌గా పనిచేసిన రంజిత్ సింగ్ 2002 జూలై 10న హర్యానా లో దారుణ హత్యకు గురయ్యారు. అతడు తన పొలంలో పనిచేస్తుండగా కాల్చి చంపేశారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీఐ.. 2007లో ఆరుగురు నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది. 2008లో అభియోగాలు నమోదు చేయగా.. 2021 అక్టోబర్ 1న కింది కోర్టు ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది. డేరా బాబాతోపాటు మరో నలుగురిని దోషులుగా నిర్ధారించింది. 2021 డిసెంబర్లో రామ్ రహీమ్ అప్పీల్‌ను విచారణకు హైకోర్టు స్వీకరిస్తూ అప్పీల్ పెండింగ్‌లో ఉన్న కాలంలో 50 శాతం జరిమానా వసూలుపై స్టే మంజూరు చేసింది. తాజాగా నిర్దోషిగా ప్రకటించారు.
డేరా బాబాపై ఈ హత్యకేసు మాత్రమేగాక తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడట్లుగా కేసు ఉంది. ఈ కేసులో గర్మీత్ను దోషిగా తేల్చిన కోర్టు.. 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. దాంతో గత నాలుగేళ్లుగా జైల్లో ఉంటున్న ఇప్పటికే ఏడు సార్లు పెరోల్‌పై బయటికి వచ్చాడు. భారీగా భక్తగణం ఉన్న డేరా బాబా కొన్నాళ్లుగా బీజేపీకి మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు.