ఏపీ ప్రతిపక్ష నేత జగన్ హెడ్ క్వార్టర్ ఇప్పుడు బెంగళూరు. తాడేపల్లి ఆయనకు క్యాంప్ ఆఫీసు. ఎప్పుడైనా ప్రజలకు తెలిసే సమావేశాలు పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రమే వస్తారు. మిగతా సమయం అంతా బెంగళూరుకే పరిమితమవుతున్నారు. అప్ అండ్ డౌన్ చేయడానికి ఆయన మానసికంగా రెడీ అయిపోయారు. జగన్ తాడేపల్లిలో ఎందుకు ఉండేందుకు ఇష్టపడటం లేదన్నది ఇప్పుడు చాలా మందికి సమాధానం తెలియని ప్రశ్న.
ఆయన ఇంట్లో ప్రభుత్వ ఫర్నీచర్ ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకూ నోటీసులు కూడా జారీ చేయలేదు. ఆయనను రాత్రికి రాత్రి ఎత్తేసే పనులు కూడా ఈ ప్రభుత్వం చేయదని.. తేలిపోయింది. ఫోన్ ట్యాపింగ్ లాంటి పనులు కూడా ఉండవని లడ్డా లాంటి ఐపీఎస్ ను ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించినప్పుడే క్లారిటీ వచ్చింది. మరి జగన్ ఎందుకు తాడేపల్లిలో ఉండేందుకు ఇష్టపడటం లేదు ?
జగన్ తన రాజకీయాలు అన్నీ కుట్రల మీదనే ఉండేలా చేసుకుంటారు. ఆయన కుట్ర రాజకీయాల సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చే వారి గురించి బయటకు తెలియకుండా ఉండేందుకు ఆయన బెంగళూరుకు మారారు. హైదరాబాద్ లో అయినా తెలిసిపోతుంది కాబట్టే ఆయన బెంగళూరుకు వెళ్లారని సన్నిహితులు చెబుతున్నారు. అదే సమయంలో అక్కడ్నుంచి వైరే చోటికి వెళ్లినా ఎవరికీ తెలియదు. తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అందుకే జగన్.. బెంగళూరుకే ప్రాధాన్యమిస్తున్నారని చెబుతున్నారు.
సొంత రాష్ట్రంలో ఉండి రాజకీయాలు చేయకపోతే క్యాడర్ కు ధైర్యం తగ్గిపోతుందని తెలిసినా.. జగన్ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. క్యాడర్ అంటే పార్టీని ఉపయోగించుకుని సంపాదించుకునేవారేనని… పార్టీ వల్ల లాభం ఉంటే ఉంటారు లేకపోతే లేరనేది ఆయన భావనని చెబుతారు.