జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఎక్కడ్నుంచి పోటీ చేయబోతున్నారనేది జనసేన వర్గాలకు కూడా అంతు చిక్కడం లేదు. పవన్ ఏ ఒక్క స్థానానికి పరిమితం కాలేదు. అనంతపురం నుంచి ప్రారంభించి.. శ్రీకాకుళం వరకు దాదాపుగా ప్రతి జిల్లాలోనూ.. పోటీ చేస్తాననే ప్రకటనలు చేసుకుంటూ వచ్చారు. దీంతో… ఆయన ్సలు ఎక్కడ్నుంచి బరిలోకి దిగుతారనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. నిన్నటిదాకా పిఠాపురం, గాజువాక పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఇప్పుడు మాత్రం.. భీమవరం పేరు కూడా తెరపైకి వస్తోంది. ఏలూరులో పవన్ కల్యాణ్ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. దీని ప్రకారం ఆయన అక్కడ… పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఇంకా ఫైనల్ కాలేదు. పీఆర్పీ అధ్యక్షుడిగా చిరంజీవి పశ్చిమగోదావరి నుంచే పోటీ చేసి పరాజయం పాలయ్యారు
నిజానికి తనకో టిక్కెట్ కేటాయించాలని… పవన్ కల్యాణ్ స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్నారు. పార్టీలో టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలన్నదానిపై.. పార్టీ తరపున ఓ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ్ తాను కూడా స్వయంగా.. ఓ దరఖాస్తును వారికి ఇచ్చారు. పవన్ తాను పోటీ చేస్తాను.. టిక్కెట్ ఖరారు చేయమని మాత్రమే దరఖాస్తు చేసారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయాన్ని మాత్రం.. స్క్రీనింగ్ కమిటీకే పవన్ వదిలేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడా స్క్రీనింగ్ కమిటీ.. పవన్ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టింది. వాటిలో ఏ నియోజకవర్గాలన్నాయన్నదానిపై క్లారిటీ లేదు. మరో వైపు నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది.
పార్టీలో చేరిన మాజీ సీబీఐ జేడీ లక్ష్మినారాయణకు.. టిక్కెట్ కేటాయించాల్సి ఉంది. ఆయన ఎక్కడ పోటీ చేస్తే బలమైన అభ్యర్థి అవుతారో .. అన్న విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. విశాఖపట్నం లోక్‌సభకు పోటీ చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా…పవన్ కల్యాణ్ మాత్రం.. ఈ విషయంలో… ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సీబీఐ మాజీ జేడీతో.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయించుకోవాలన్న ఆలోచనలో పవన్ ఉన్నారు. అయితే.. పోటీ చేసే ఉద్దేశంతోనే… పార్టీలో చేరినందున.. ఆయన కచ్చితంగా లోక్‌సభకు పోటీ చేస్తారని చెబుతున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్.. చివరికి.. పార్టీ అభ్యర్థుల బాధ్యతను తీసుకుని.. తాను పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉందన్న.. అభిప్రాయం కూడా.. జనసేనలో కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.