మద్యపానం హనికరం అనేది ప్రతి బాటిల్ పై ఉంటుంది. అందరూ చెప్పేది. సరే, తాగే వారికి ఇష్టం ఉంటే ఎవరేం చేస్తారు అనుకోవచ్చు. కానీ, పిల్లలు తినే ఐస్ క్రీమ్స్ లో కూడా విస్కీ యాడ్ చేస్తే…?
హైదరాబాద్ లో అరికో ఐస్ క్రీమ్ నిర్వాహకులు మాత్రం విస్కీతో తయారు చేసిన ఐస్ క్రీమ్స్ ను అమ్ముతున్నారు. 60గ్రాముల ఐస్ క్రీమ్ లో 100మి.లీ పేపర్ విస్కీని కలిపి అమ్ముతున్నారు. కొన్ని ఫ్లేవర్స్ లో వొడ్కాను కూడా కలిపి అమ్ముతున్నారు.
స్కూల్స్ పిల్లలే టార్గెట్ గా ఈ విస్కీ ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు. ఇక్కడికి అలవాటైన పిల్లలు ఈ విస్కీ ఐస్ క్రీమ్స్ ను అడుగుతున్నారు. అనుమానం వచ్చిన ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించటంతో అరికో ఐస్ క్రీమ్స్ నిర్వాహకులు దయానంద్ రెడ్డి, శోభన్ లు పరారీలో ఉన్నారు. అధికారులు రెడ్ హ్యాండెడ్ గా విస్కీని కలుపుతున్నప్పుడు గుర్తించారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెం.1, రోడ్ నెం.5లలో ఈ ఐస్ క్రీమ్స్ షాప్స్ ను నిర్వహిస్తున్నారు. గతంలో గంజాయి అలవాటు చేసేందుకు ఎలాగైతే చాక్లెట్ల రూపంలో ఇచ్చే వారో… ఇప్పుడు ఐస్ క్రీమ్స్ పేరుతో మద్యానికి పిల్లలను బానిసను చేస్తున్నారు.
నిర్వాహకులపై కేసు నమోదు చేసిన అధికారులు, ఐసీక్రీమ్ షాపులను సీజ్ చేశారు.