వైసీపీ నుంచి రాజ్యసభ, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తున్నారు. అయితే వారికే ఆ పదవులు ఇచ్చే పరిస్థితి లేదన్న వాదన వినిపిస్తోంది. కొంత మంది పార్టీల్లో చేరితే తిరిగి ఇచ్చినా కొంత మంది మాత్రం… పదవులు త్యాగం చేయకతప్పదని భావిస్తున్నారు.
ముఖ్యంగా మోపిదేవి వెంకటరమణారావుకు మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అవకాశం లేదు. ఆయనకు ఢిల్లీ వెళ్లే ఆసక్తి లేదు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సీట్లు పెరుగుతాయి కాబట్టి.. సీటు విషయంలో ఇబ్బంది ఉండదు. అందుకే ఇప్పుడు రాజ్యసభను వదులుకుంటున్నారు. ఆయన పదవి కాలం రెండేళ్లలోపే ఉంది. ఉపఎన్నికల్లో ఆయన సీటును అశోక్ గజపతిరాజు లేదా యనమలకు ఇచ్చే అవకాశం ఉంది.
ఇక పోతుల సునీత రాజీనామా చేసిన స్థానాన్ని బీటెక్ రవికి ఇస్తారని చెబుతున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. వారు ఏ పార్టీల్లో చేరితే వారికి ఆ సీట్లు కేయించే అవకాశం ఉంది. మరకొంత మంది రాజీనామాలు చేస్తారు. వారిలో ఎంత మందికి పదవులు ఇస్తారో అన్నదానిపై డౌట్ ఉంది.