దేశంలో నెంబర్ వన్ లాభాలు , ఆస్తులు ఉన్న కంపెనీ ఏది. మరో మాటలేకుండా చెప్పేది ఎల్ఐసీ గురించే. ఇలాంటి కంపెనీ వాటాలను అమ్మాలని కేంద్రం నిర్ణయిస్తే.. షేర్ మార్కెట్లో ఆ కంపెనీకి తిరుగు ఉండదనుకున్నారు. రూ. రెండు వేలకు షేర్ అమ్మితే.. లిస్టింగ్ అయిన వారంలో ఎడెనిమిది వేలకు చేరుకుంటుదనుకున్నారు. కానీ వాస్తవంలో అది రివర్స్ అయిది. ఎల్ఐసీ షేర్ల కోసం ఎగబడినవారు ఉన్నప్పటికీ.. వాటిని షేర్ మార్కెట్లో కొనడానికి ఎవరూ ఆసక్తి చూపించడంలేదు. ఫలితంగా షేర్ ధర పడిపోతూ వస్తోంది. లిస్టింగ్ ప్రైస్ కన్నా తక్కువ ధర నమోదవుతూండటంతో.. వాటాదార్లు భారీగా నష్టపోయారు.
అదే సమయంలో అదానీ గ్రూప్ షేర్లు మాత్రం అమాంతం పెరుగుతున్నాయి. ఆ కంపెనీల లాభాలతో నిమిత్తం లేకుండా షేర్లు పెరిగిపోతున్నాయి. అదానీ విల్మర్ పేరుతో ఉన్న కంపెనీ ఎడిబుల్ ఆయిల్.. కొన్ని ఆహార ఉత్పత్తులు అమ్ముతూ ఉంటుంది. ఆ కంపెనీ లాభాలు.. ఖర్చుల సంగతేమో కానీ షేర్ మాత్రం ఎల్ఐసీ కంటే ఎక్కువగా గ్రోత్ నమోదు చేస్తోంది. అదానీ కంపెనీకి చెందిన ఇతర షేర్లూ అదే దారిలో ఉండటంతో ఆయన అత్యంత సంపన్నుడిగా మారిపోయారు.
అయితే ఎల్ఐసీ ఎందుకు చేదయింది… అదానీ గ్రూప్ ఎందుకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు తీపి అయిందనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఎల్ఐసీ విషయంలో మార్కెట్ వర్గాల అంచనాలు కూడా తలకిందలయ్యాయి. గొప్ప సంచలనం నమోదవుతుందనుకుంటే.. నిర్వీర్యమైన పరిస్థితి కనిపిస్తోంది. మార్కెట్ అంతా మాయాజాలం అని.. ఓ రకమైన గ్యాంబ్లింగ్ అని.. ఎల్ఐసీ విషయంలోనూ.. అదానీ విషయంలోనూ అదే జరుగుతోందని.. ఆశపడి పెట్టుబడులు పెట్టిన వారు నిరాశపడుతున్నారు. కాస్త వాస్తవంగా ఆలోచిస్తే.. నిజమేనని ఎవరికైనా అనిపించకమానదు. మరదే స్టాక్ మార్కెట్ అని కొంత మంది ఏకవాక్యంతో సమర్థిస్తూ ఉంటారు.