ఏపీ సీఎం జగన్ తీరు వైసీపీ నేతలకే కాదు సామాన్యులకూ అంతుబట్టడం లేదు. ప్రజలు విపత్తుల బారిన పడి నానా తిప్పలు పడుతూంటే ఆయన సంబంధం లేని అంశాలపై సమీక్షలు నిర్వహిస్తూ… బటన్ నొక్కేశాను.. డబ్బులు ఖాతాల్లో చేరిపోయాయనే ప్రకటనలు చేస్తూ కాలం గడుపుతున్నారు. సొంత జిల్లాను వరదలు చుట్టుముట్టి అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన తీవ్ర ఘటన సమయంలోనూ ఆయన క్యాంప్ ఆఫీస్కే పరిమితమయ్యారు. ఇప్పుడు గోదావరి వరదల విషయంలోనూ అంతే. అయితే రెండు సందర్భాల్లో ఓ పూట ఏరియల్ సర్వే చేశారు. కానీ క్షేత్ర స్థాయిలో పర్యటనలుక మాత్రం దూరంగా ఉన్నారు.
ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నా పట్టించుకోవడం లేదు. బాధితుల్లో తమను పట్టించుకోవడం లేదన్న భావన పెరుగిపోతుదంనే అభిప్రాయం వినిపిస్తున్నా లైట్ తీసుకుంటున్నారు. గోదావరి వరద వందేళ్లలో ఎప్పుడూ రానంత వచ్చిందని సీఎం జగన్ స్వయంగా చెప్పారు. పెద్ద ఎత్తున గ్రామాలు మనిగిపోయాయి. పోలవరం ముంపు గ్రామాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రజలకు సాయం అందడం లేదు. వారి కష్టాలను ఆలకించేవారులేరు.
విపత్తుల సమయంలో తాను ఆయా ప్రాంతాలకు వెళ్లడం వల్ల అధికార యంత్రాంగం మొత్తం తన పర్యటన ఏర్పాట్ల కోసం పని చేస్తుందని దాని వల్ల సహాయ కార్యక్రమాలకు వెళ్లడం లేదని చెప్పారు. బాధితుల్ని మరింత ఇబ్బంది పెట్టలేననే వాదన ఆయన వినిపించారు. సీఎం జగన్ క్షేత్ర స్థాయిలో ఉంటేనే అధికారులు మరింత జాగ్రత్తగా ప్రజలకుసేవలు చేస్తారని .. లేకపోతే ఎవరూ అదుపులో ఉండరని…పట్టించుకోరని చెబుతున్నారు. బాధితులకు పరామర్శ ఇవ్వడం ఇష్టం లేక.. ఎక్కడ సాయం ప్రకటించాల్సి వస్తుందోనన్న కారణంగానే జగన్ విపత్తు ప్రాంతాలకు వెళ్లరని విపక్షాలు విమర్శలు వస్తున్నాయి.
అదే సమయంలో విపక్ష నేతలు ఎంత కష్టమనా పరిశీలన జరిపి బాధితులకు వీలైనంత సాయంతో పాటు.. భరోసా ఇస్తున్నారు. ఆ ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరగడం లేదు. కానీ అలా వెళ్తున్న విపక్షాలను మాత్రం ప్రచారం కోసం చేస్తున్నారంటూ ప్రభుత్వ సలహాదారులు విమర్శిస్తూ.. తమ పెట్టం.. ఇతరులను పెట్టనివ్వం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. వారిని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి అనుభవించాల్సిందే.