సీఎం జగన్ ప్రజలకు తెలియదని అనుకుంటున్నారో.. తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నానని అనుకుంటున్నారో లేకపోతే… పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్నట్లుగా ఫీలవుతున్నారో కానీ… అసువుగా అబద్దాలు చెప్పేస్తున్నారు. నాకు మీడియా లేదంటారు. తనకు ఆస్తులు లేవంటారు. పేదవాడినంటారు. మంచివాడినంటారు. చెడు చేసిన వాళ్లకూ మంచే చేస్తానంటారు. రాజకీయాలు చెడిపోయాయంటారు.. తన నివాసం ఇక్కడే ఆయన మాటలు వింటూ ఉంటే… చేస్తున్న చేతలనూ పోల్చుకుంటే చాలా మందికి .. అపరిచితుడులో రామం గుర్తుకొస్తారు. కానీ ఇంత బహిరంగంగా కనిపిస్తున్నా జగన్ ఎందుకిలా అబద్దాలు చెబుతున్నారు.
పేపర్లు, టీవీలు జగన్కు లేవా ? నమ్మేవాళ్లుంటారా ?
తనకు టీవీలు, పేపర్లు లేవని జగన్ చెబుతూ ఉంటారు. కళ్ల ముందు ఆయన తండ్రి వైఎస్ ఫోటోను పెట్టుకున్న మీడియా ఉంటుంది. ఆయన భార్య చేతుల్లోనే ఉంది అది. ఆ మీడియా వ్యవస్థాపకుడు జగన్. రూపాయిపెట్టుబడి పెట్టకుండా నిర్మించిన సామ్రాజ్యం అది. అయినా తనకు లేదంటారు. ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఆయనకు సొంత మీడియా కాకుండా కూలి మీడియా కూడా ఉంది. వేల మందితో సోషల్ మీడియా సైన్యం ఉంది. అందరికీ తెలుసు. కానీ ఏమీ లేదని అమాయకంగా చెప్పి ఎవర్ని నమ్మిస్తారు ?
ఏపీలోనే ఆయనకు నివాసమా ? ఇంకెక్కడా లేదా..? ఎవరికీ తెలీదా ?
జగన్మోహన్ రెడ్డి తనకు ఇక్కడే నివాసమని ఇంకెక్కడా లేదని బహిరంగసభల్లో చెబుతున్నారు. ఆయన అసలు పుట్టి పెరిగింది బెంగళూరులో. బెంగళూరులో యలహంకలో ఆయనకు ఉన్న ప్యాలెస్ గురించి కథలు కథలుగా చెబుతారు. ఇల లోటస్ పాండ్ గురించి చెప్పాల్సిన పని లేదు. సీఎం అయ్యాక చెన్నైలోనూ ఓ ప్యాలెస్ కట్టించారు. ఇప్పుడు విశాఖలో ప్రజాధనంతో రుషికొండపై కడుతున్నారు. కడప, పులివెందుల, ఇడుపులపాయ, తాడేపల్లి ఇలా ప్రతీ చోటా ఓ ప్యాలెస్ ఉంది. అయినా.. ఎందుకలా ఆయన అమాయకంగా ఫేస్ పెట్టి ప్రజలకు చెబుతారో ?
తనకు కీడు చేసిన వారికీ మేలుచేస్తారట !
జగన్మోహన్ రెడ్డి అంటే… రాజకీయాల ను వ్యక్తిగత కక్షలుగా చేసుకుని పరిచయం లేని వాళ్లను కూడా అడ్డగోలుగా వేధించిన చరిత్ర ఉన్న నేత. ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి అందరికీ తెలుసు. ఆయనది విపరీత మనస్థత్వమని… మానసిక నిపుణులు విశ్లేషించాల్సిన పని లేదు. ఏపీలో జరుగుతున్న ఘటనలే నిరూపిస్తాయి. అయినా తనది కీడు చేసిన వారికీ మేలు చేసే మనస్థత్వమని సొంతంగా చెప్పుకుంటారు. అమాయకంగా ఇలా చెబితే నమ్మేస్తారా ?
రాజకీయాలు చెడిపోయాయంటారు !
అధికారంలోకి రావడానికి ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశారో.. ఎన్ని ఫేక్ హామీలు ఇచ్చారో కళ్ల ముందు కనిపిస్తోంది. సీపీఎస్ రద్దు నుంచి జాబ్ క్యాలెండర్ వరకూ అన్నీ ఫేకే. తాను చెప్పిన విలువల ప్రకారం రాజీనామా చేయాల్సింది పోయి… తనను విమర్శిస్తున్నందున రాజకీయాలు చెడిపోయాయంటారు. సీఎం ఇలా అనడానికి రెండే కారణాలు ఉంటాయి.. ఒకటి ప్రజల్ని ఓ మాదిరిగా కూడా అంచనా వేయకపోవడం…. రెండు ఆయనో విచిత్రమైన మానసిక పరిస్థితిలో .. మాయా ప్రపంచంలో బతకడం.