ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ పర్యనటకు వస్తున్నారు. ఏపీ ప్రజలు, ప్రజాసంంఘాలు మొత్తం… విభజన హామీల విషయంలో స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. కానీ ప్రధానమైన రెండు రాజకీయ పార్టీలు వైసీపీ, జనసేన మాత్రం సైలెంట్ గా ఉన్నాయి. నిన్నటి వరకూ సైలెంట్ గా ఉన్నా.. ఈ రోజు మాత్రం.. చంద్రబాబుపైనే విమర్శలు ప్రారంభించారు. మోడీ ఏపీ పర్యటన విషయంలో జనసేన నేతల నుంచి ఇంత వరకూ.. అధికారికంగా ఒక్క స్పందన రాకపోయినప్పటికీ.. జనసేన ట్విట్టర్ ఖాతాలో మాత్రం.. ఓ ప్రకటన వచ్చింది. అయితే.. మోడీ..ఏపీ విభజన హామీలపై స్పందించాలనో… మరో డిమాండో కాదు. అలా స్పందించాలని.. చంద్రబాబు డిమాండ్ చేయడం తప్పన్నట్లుగా ఆ ట్వీట్ ఉంది.
చంద్రబాబు నెల్లూరులో జరిగిన గృహప్రవేశాల కార్యక్రమంలో.. మోడీని ఏ మొహం పెట్టుకుని వస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. దాన్ని ట్విట్టర్ లో పెట్టారు. దాన్ని రీ ట్వీట్ చేస్తూ.. జనసేన అధికారికంగా.. విమర్శలు చేసింది. ఒకప్పుడు తాము పోరాడామని.. అప్పుడు.. బీజేపీతో చంద్రబాబు ఉన్నారని.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మోడీని ప్రశ్నిస్తున్నారని అందులో… కామెంట్ చేశారు. అంటే జనసేన ఏపీకి వస్తున్న మోడీ విషయంలో స్పందించడానికి ఏ మాత్రం సుముఖంగా లేదు కానీ.. మోడీని విమర్శిస్తున్న చంద్రబాబుపై ఎటాక్ చేయడానికి రెడీ అయిపోయారు.
మూడేళ్ల క్రితమే పవన్ కల్యాణ్.. మోడీపై తిరగబడ్డారు. ఘాటు పదజాలంతో.. ప్రత్యేకహోదా సభలు పెట్టారు. కానీ.. అసలు సమయానికి వచ్చే సరికి చల్లబడిపోయారు. మోడీపై అమితమైన అభిమానం చూపిస్తున్నారు.
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలుది… ఈ విషయంలో మరింత భిన్నంగా ఉంది. మోడీ సభకు… జనాలను తరలించడానికి ఆ పార్టీ నేతలు సహకరిస్తున్నారు. ప్రత్యేకంగా వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇది చేతలు.. ఇక మాటల్లో.. చంద్రబాబుపై చేసే విమర్శలు ఎక్కువే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన ఇద్దరూ .. మోడీ పర్యటన విషయంలో.. బీజేపీకి సైలెంట్‌గానే సపోర్ట్ చేస్తున్నారు. పైగా..మోడీ పర్యటనను వ్యతిరేకిస్తున్న టీడీపీ, చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు మోడీ పర్యటనతో బీజేపీ ఖాతాలోనే వైసీపీ, జనసేన ఉన్న విషయం మరోసారి క్లారిటీగా ప్రజల ముందు ఉంటోంది.