గుంటూరు సభలో నరేంద్రమోడీ చేసిన విమర్శల్లో ప్రధానంగా చంద్రబాబును టార్గెట్ చేసినప్పటికీ.. అంతర్లీనంగా.. ఆయన లోకేష్‌ను గురి పెట్టారు. చాలా సందర్భాల్లో.. లోకేష్ తండ్రి చంద్రబాబు అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఏదో.. లోకేష్‌కు తండ్రిగా గుర్తింపు తెచ్చుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇలా.. లోకేష్‌పై ఎందుకు.. మోడీ గురి పెట్టారన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి లోకేష్ చాలా లో ప్రోఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. అయినప్పటికీ .. మోడీ.. లోకేష్‌ను టార్గెట్ చేయడం వెనుక అసలు కారణం ఏమిటన్నదానిపై విస్త్రతమైన చర్చలు ప్రారంభమయ్యాయి.
ప్రధానమంత్రిగా ఉన్న మోడీ.. వచ్చే ఎన్నికల్లో.. ప్రధాని పీఠం కోసం.. చంద్రబాబు పోటీ పడుతున్నారని అనుమానిస్తున్నారు. ఏపీలో లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసి.. చంద్రబాబు తాను ప్రధాని అవ్వాలనుకుంటున్నారని.. ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే.. లోకేష్‌ను టార్గెట్ చేశారని.. అంచనా వేస్తున్నారు. నిజానికి లోకేష్ పనితీరు విషయలో కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి అనేక అవార్డులు వచ్చాయి. ఆయన పనితీరును పంచాయతీరాజ్, ఐటీ శాఖలు మెచ్చాయి. అయినప్పటికీ.. రాజకీయంగా మోడీ… చాలా దిగువ స్థాయిలో.. లోకేష్ తండ్రి చంద్రబాబు అంటూ విమర్శలు చేశారు. వారసత్వంగా లోకేష్‌ను.. చంద్రబాబు ప్రమోట్ చేయాలనుకుంటున్నారని చెప్పి.. ఆ విధంగా వ్యతిరేకతను.. పెంచేందుకు …మోడీ ప్రయత్నించారని.. రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
తానేదో దేశం కోసం జీవిస్తున్నానని..మిగతా రాజకీయ నాయకులంతా.. వారసుల కోసం.. పని చేస్తున్నట్లుగా చెప్పుకోవాలన్న తాపత్రయం.. మోడీ ప్రసంగాల్లో కనిపించింది. కాంగ్రెస్ పార్టీపై.. ప్రధానంగా మోడీ ఇవే ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఆ పార్టీ వారసత్వం మీద ఆధారపడుతుందని చెప్పుకొస్తారు. అలాంటి ఫార్ములానే.. ఏపీపైనా ప్రయోగించారు మోడీ. లోకేష్‌ను ఏపీకి ముఖ్యమంత్రిని చేసి.. చంద్రబాబు ప్రధానమంత్రి అవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పడానికే.. ఆయన .. లోకేష్ తండ్రి చంద్రబాబు అంటూ పదే పదే వ్యాఖ్యానించి.. రాజకీయ విమర్శల్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారన్న అభిప్రాయం ఏర్పడుతోంది.