ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. గుంటూరుకు వచ్చి… చంద్రబాబు ఓడిపోతారని.. బల్లగుద్ది మరీ చెప్పారు. మోడీ నాటకీయంగా చెప్పుకున్నట్లు… ఆ ప్రచార సభ ఖర్చు బీజేపీనే పెట్టుకుంది..! ఎందుకు పెట్టుకుంది..! తమ పార్టీని గెలిపించాలనే కదా..! తమ పార్టీని ఏపీలో అధికారంలోకి తీసుకు రావాలని లేదా… మరింత బలోపేతం చేసుకోవాలనే కదా..! మరి ఎందుకు.. భారతీయ జనతా పార్టీకి ఓటు వేయమని కానీ.. ఏపీలో బీజేపీని గెలిపించమని కానీ .. ఒక్క సారి కూడా అడగలేదు…? చంద్రబాబు ఓడిపోతారని.. పదే పదే చెప్పిన మోడీ.. ఆ వెంటనే.. బీజేపీని గెలిపించాలని ఎందుకు అభ్యర్థించలేకపోయారు…?. అంటే.. బీజేపీ ఖర్చు పెట్టుకుని మరీ ఏర్పాటు చేసిన ఈ సభ .. బీజేపీని గెలిపించడానికి కాదా..?
భారతీయ జనతా పార్టీ లక్ష్యం చంద్రబాబును ఓడించడమే. కన్నా లక్ష్మినారాయణ.. కార్యకర్తల వద్ద నుంచి కోట్లు సేకరించి… నిర్వహించిన సభలో… ఆ విషయాన్ని స్పష్టం చేశారు. వారెలా గెలవరు కాబట్టి.. చంద్రబాబును ఓడించాలి. మరి ఎవర్ని గెలిపించాలి. ఈ విషయంలోనూ.. ఇన్ డైరక్ట్‌గా.. ఆన్సర్ ఇచ్చారు. సభకు ప్రజలను తరలించిన పార్టీనే గెలిపించాలని… బీజేపీ నేతలు కంకణం కట్టుకున్నట్లుగా.. వ్యవహారం మొత్తం జరిగిపోయింది. బీజేపీ జెండాలు పెట్టి.. బీజేపీ తరపున నేరుగా ప్రధాని .. గుంటూరుకు వచ్చి.. బీజేపీకి ఓటేయమని చెప్పలేకపోయారు. కానీ చంద్రబాబు ఓడిపోతారని మాత్రం చెప్పుకొచ్చారు.
ఉత్తరాదిలో కోల్పోయే సీట్లను.. దక్షిణాదిలో రహస్య మిత్రుల ద్వారా.. తెచ్చుకోవాలనేది బీజేపీ లక్ష్యం. అందు కోసమే… తమకు అడ్డంకిగా ఉన్న వారిని… రాజకీయంగా అంత మొందించేందుకు.. దక్షిణాదిలోనే చేయాల్సిన కుట్రలన్నింటినీ బీజేపీ చేస్తోంది. శబరిమల వివాదం దగ్గర్నుంచి కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేయడం వరకూ.. అన్నీ అందులో ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో.. చంద్రబాబును.. టార్గెట్ చేసి… ప్రచారం ప్రారంభించారు. తమకు లాభం లేకపోయినా… చంద్రబాబుపై వ్యతిరేకత పెంచితే.. వైసీపీకి లాభం కలుగుతుంది కాబట్టి… తాము కోట్లు ఖర్చు పెట్టుకుని ప్రచార సభలు నిర్వహించి చంద్రబాబును విమర్శించేసి వెళ్తున్నారు.