ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చూసినా.. ఏ పని చూసినా వాళ్లే. ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు వరకూ వేల కోట్ల బిల్లులు చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి కష్టం వస్తే మాత్రం ఒక్క కాంట్రాక్టర్ కూడా తిరిగి చూడటం లేదు. కనీసం వరద బాధితులకు సీఎస్ఆర్ ఫండ్స్ కింద అయినా… ఎంతో కొంత తక్షణ సాయం చేసేందుకు కూడా ఆలోచన చేయడం లేదు. అంతా సైలెంట్ గానే ఉంటున్నారు. ఏపీలోనే కాదు.. తెలంగాణలో కూడా.
ఏపీలో నాలుగైదు కంపెనీలదే హవా. మొత్తం కాంట్రాక్టులు వారికే. మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్, వైసీపీ కుటుంబ బినామీ షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ , పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ , అరబిందో సహా పోర్టుల కాంట్రాక్టులు పొందిన మరికొన్ని కంపెనీల ఖాతాలోనే ప్రజల సొమ్ము వేల కోట్లు జమ అయింది. ఇక అడ్డగోలుగా దోచుకున్న ఇతర నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు వారంతా ఒక్క రూపాయి కూడా బయటకు తీయడం లేదు. సాయం చేద్దామని ముందుకు రావడం లేదు.
గతంలో అయితే బిల్లులు వస్తాయని ఏమో.. ఏదైనా అవసరం అయితే చెక్ పెట్టుకుని రెడీ అయిపోయేవారు. సాక్షి పత్రికలో అవసరానికి మించి ప్రకటనలు ఇచ్చి క్విడ్ ప్రో కో రాజకీయాలు చేసేవారు. ఇప్పుడు మాత్రం ఏపీకి ఎంత కష్టం వచ్చినా నోరు మెదపడం లేదు.