విపత్తులొస్తే ప్రజల్ని పట్టించుకోరు. కేంద్రాన్ని సాయం అడగరు. తాము సాయం చేయరు. పంటలు మునిగిపోతే పట్టించుకోరు. వరదలతో సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకోరు. నింపాదిగా వ్యవహరిస్తూ ఉంటారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకే రారు. అక్కడే ఉండి.. రూ. రెండు వేలతో ప్రారంభించి టమోటాలు, బంగాళాదుంపల వరకూ లెక్కలు చెప్పి అన్నీ పంపిణీ చేసేయండి అని ఆదేశిస్తారు. కానీ అందుతున్నాయో లేదో పర్యవేక్షణ ఉండదు. మొత్తానికి అనుకూల మీడియాలో మాత్రం ప్రకటనలు చూపించారు. ఇతర మీడియాల్లో వ్యతిరేకత వార్తలు వస్తే.. తప్పుడు ప్రచారం అని టీడీపీ ముద్ర వేసి .. రిలాక్స్ అవుతున్నారు.
ప్రజల ఇబ్బందులు తాడేపల్లి ప్యాలస్కు అంత తేలికగా కనిపిస్తున్నాయా ?
పూర్తిగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు రోడ్ల వంటి మౌలిక సదుపాయాలు లేవు. మరో వైపు ప్రజల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. ఏపీలో అన్ని రకాల పన్నులు అత్యధికంగా ఉన్నాయి. మద్యం బారిన పడి అనేక కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. అన్నింటికీ మించి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు అధికారం అనుభవించడానికే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కానీ.. అది బాధ్యతగా మాత్రం ఫీలవడం లేదు.
రాష్ట్రప్రయోజనాల కోసం నోరెత్తలేని అధికారం ఎందుకు ?
ఓ వైపు రాష్ట్రం వెనుకబడిపోతోంది.. మరో వైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రూ. లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు. అదంతా ఎటుపోతుందో తెలియడం లేదు. కానీ లక్షన్నర కోట్లు ప్రజలకు పంచామని చెబుతున్నారు. అలాంటి పరిస్థితే ఉంటే.. ఎందుకింద వ్యతిరేకత అని ఆలోచించే పరిస్థితి లేదు. కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అయినా ప్రయత్నిస్తున్నారా అంటే అదీ లేదు. కేంద్రంతో కాదు కనీసం పొరుగు రాష్ట్రం తెలంగాణ తోనూ పోరాడలేకపోతున్నారు. శ్రీశైలంలోకి వచ్చిన నీళ్లు వచ్చినట్లుగా తోడేస్తున్నా.. కరెంట్ ఉత్పత్తి చేస్తున్నా తూతూ మంత్రంగా ఫిర్యాదు చేయడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.
అధికారం అనుభవించడానికి కాదు అదో బాధ్యత అని గుర్తించలేరా ?
అన్ని రాష్ట్రాలు విపత్తులు వస్తే తమకు సాయం చేయాలని కేంద్రాన్ని అడుగుతాయి. ఇచ్చే వరకూ వెంట పడతాయి. కానీ ఏపీలో ఆ ఊసే లేదు. ఇంత వరకూ పైసా సాయం కావాలని అడగలేదు. పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు. ఏది జరిగుతుందో అది జరుగుతుదంని పాలకులులైట్ తీసుకుంటున్నారు. ఇంత కంటేద్రోహం ఏమీ ఉండదు. కానీ వారికి అలా అనిపించడం లేదు.