చినజీయర్ స్వామి అంటే జగన్‌కు ప్రత్యేకమైన అభిమానం. కారణం ఏదైనా.. శంషాబాద్ వైపు వెళ్తే… ముచ్చింతల్ వెళ్లి ఆశీర్వాదం తీసుకుని వస్తారు. ఇటీవల సమతామూర్తి విగ్రహానికి జగన్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. జగన్ కూడా వెళ్లి వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా వరకూ ముచ్చింతల్లోనే ఉండి.. ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఆయనకు కేసీఆర్‌తో చెడింది. కేసీఆర్ ఆయనను దూరం పెట్టారు. ఇప్పుడు జగన్ కూడా ఆయనను దూరం పెడుతున్నట్లుగా కనిపిస్తోంది.
రెండు రోజుల కిందట… చినజీయర్ రాజమండ్రి పర్యటనకు వెళ్లారు. ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. వైసీపీ నేతలు కూడా ఆయనను దర్శించుకోలేదు. మామూలుగా స్వరూపానంద వెళ్తేనే వైసీపీ నేతలు వరుసగా సాష్టాంగ ప్రమాణాలు చేసి భక్తిని ప్రదర్శించుకునేవారు. కానీ చినజీయర్‌ను మాత్రం లైట్ తీసుకున్నారు. మాములుగా అయితే వైసీపీ ప్రభుత్వంతో ఆయనకు ఎలాంటి విభేదాలు లేవు. కేవలం కేసీఆర్ దూరం పెట్టినందునే ఇక్కడ వైసీపీ నేతలు కూడా… ఆయనను పట్టించుకోవడం మానేశారు.
అందుకే.. చినజీయర్ కూడా తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. రోడ్ల పరిస్థితిపై సెటైర్లు వేశారు. ఆయన రోడ్ల పరిస్థితిపై సెటైర్లు వేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మామూలుగా అయితే ఆయన ఇలా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యాలు చేయరు. కానీ.. జగన్ కూడా దూరం పెడుతున్నట్లుగా ఫీల్ కావడంతోనే ఇలా మాట్లాడారని అంటున్నారు. మొత్తానికి చినజీయర్ కు ఇద్దరు ముఖ్యమంత్రులూ దూరమైనట్లుగానే కనిపిస్తోంది.