తెలుగు తెరపై మరో కొత్త హీరోయిన్ మెరవబోతోంది. తనే భాగశ్రీ బోర్సే. ‘మిస్టర్ బచ్చన్’ కోసం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రవితేజ సినిమాలన్నీ మాసీగా ఉంటాయి. హరీష్ శంకర్ సినిమా అంటే ఇహ చప్పక్కర్లెద్దు. అయితే ‘మిస్టర్ బచ్చన్‘ కోసం మాట్లాడుకొనేటప్పుడు భాగ్యశ్రీ బోర్సే గురించి కూడా ప్రస్తావించుకొంటున్నారు. ఎందుకంటే తెరపై భాగ్యశ్రీని చాలా అందంగా చూపించాడు హరీష్ శంకర్. ఇప్పటి వరకూ వచ్చిన రెండు పాటల్లోనూ భాగ్యశ్రీనే సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యింది. మాస్ పాటలో హుషారైన స్టెప్పులేసిన భాగశ్రీ, మెలోడీలో తన గ్లామర్ అంతా ఒలికించింది. కెమెరామెన్ మహిమో, కాస్ట్యూమ్స్ మహత్య్మమో, నిజంగానే భాగ్యశ్రీలో అంత గ్లామర్ ఉందో… తెలీదు కానీ తాను మాత్రం బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా, తన స్క్రీన్ ప్రెజెన్స్ తో భాగ్యశ్రీ ఆకట్టుకొంటే – తెలుగులో మరిన్ని అవకాశాలు ఆమె అందిపుచ్చుకోవొచ్చు.
కృతిశెట్టి, శ్రీలీల… వీళ్లంతా ఒక్క సినిమాతోనే పాపులారిటీ తెచ్చుకొన్నారు. ఆ తరవాత గంపెడు అవకాశాల్ని అందిపుచ్చుకొన్నారు. శ్రీలీల తరవాత ఒక్క సినిమాతో ఫేమ్ అయినవాళ్లు లేరు. ఇప్పుడు కూడా కొత్త హీరోయిన్ల కోసం చిత్రసీమ అంతా జల్లెడ పడుతోంది. ఎక్కడ ఓ కొత్త అందం మెరిసినా, చటుక్కున క్యాప్చర్ చేస్తోంది. అందుకే ఇప్పుడు అందరి కళ్లూ భాగ్యశ్రీపైనే. జాన్వీ కపూర్ కూడా కొత్త హీరోయినే. కాకపోతే… తను వచ్చీ రావడంతోనే స్టార్ మెటీరియల్ అయిపోయింది. బాలీవుడ్ లో ఇది వరకే సినిమాలు చేసింది కాబట్టి, తనపై కొన్ని అంచనాలు ఉన్నాయి. భాగశ్రీ అలా కాదు. తనకు తెలుగులో ఇదే తొలి సినిమా. ‘మిస్టర్ బచ్చన్’తో క్లిక్ అయితే.. మీడియం రేంజ్ సినిమాలకూ, హీరోలకూ మంచి ఆప్షన్ అవుతుంది.