తిరుపతిలో పధ్నాలుగో తేదీన జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో హోంమంత్రి అమిత్ షాను ప్రత్యేకహోదా గురించి అడుగుతారని ఓ లీక్ బుధవారం మీడియా ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వ పీఆర్వోల నుంచి వచ్చింది. దాంతో అందరూ .. ఇక సీఎం జగన్ హోదా యోధుని అవతారంలోకి మళ్లీ వెళ్లబోతున్నారని చెప్పుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు సీఎం సొంత మీడియాలో ఎక్కడా ప్రత్యేకహోదా అనే మాట కూడా కనిపించడం లేదు. రాష్ట్రానికి మేలు చేసే అంశాలను అజెండాలో చేర్చాలని సీఎం జగన్ సమీక్షలో చెప్పినట్లుగా రాసుకొచ్చారు.
విభజన హామీలను పరిష్కరించాలని కోరాలని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఈ విభజన హామీల్లోనే ప్రత్యేక హోదా ఉందని అనుకోవాలి. ప్రత్యేక హోదా విషయంలో ప్రజల్ని మభ్య పెట్టేందుకు కొత్తగా ఇలాంటి స్కెచ్ లు వేస్తున్నారని విపక్షాలు విమక్షాలు విమర్శించడానికి ఇలాంటి స్ట్రాటజీలు పనికి వస్తాయి కానీ ప్రజల్లో నమ్మకం కలిగించడానికి ఉపయోగపడవు. జరుగుతోంది సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం… సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న సమావేశం.
ఇందులో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తామని బయట మీడియాలో వచ్చేలా చూసుకుని సొంత మీడియాలో మాత్రం అలాంటి ప్రస్తావనే చేయకపోడం రాజకీయ అంవుతుంది తప్ప.. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవదు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న సమావేశాల విషయంలోనూ ఇలా ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేయడం కన్నా సిన్సియర్‌గా రాష్ట్రం కోసం ప్రయత్నిస్తే మంచిదన్న సలహాలు సహజంగానే వస్తాయి.