వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ మేనిఫెస్టోలో ఏముందన్న సంగతి పక్కన పెడితే ఎగ్గొట్టిన హామీలు.. ఎందుకు అమలు చేయలేదన్న విషయాలను కూడా వివరించాల్సి ఉంది. కానీ అలా చెప్పే ధైర్యం లేక వదిలి పెట్టేశారు.
జగన్మోహన్ రెడ్డి తనకు మనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అయితే మద్య నిషేధంపై ఖచ్చితంగా సమాధానం చెప్పి ఉండేవారు. మూడుదశల్లో మద్యాన్ని నిఫేధించి.. ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని బైబిల్ లో రాసుకొచ్చారు. మద్య నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతామని సవాల్ చేశారు. మరి ఓట్లకు వెళ్లే ముందు ఎందుకు ఆ విషయంపై మాట్లాడటం లేదు. ఎందుకు చేయలేకపోయారో చెప్పడం లేదు. అదొక్కటేనా ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ , రాగానే మెగా డీఎస్సీ అన్నారు. ఐదేళ్లలో ఒక్క సారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. టీచర్ల పోస్టుల భర్తీ లేదు. ఎందుకు చేయలేకపోయారో చెప్పాలి కదా !
Also Read : మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?
” అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు ” అన్నారు. అవగాహన లేదని చీఫ్ సలహాదారులో చీఫ్ మినిస్టర్ చెప్పించారు. అలా అయితే రాజీనామా చేసి వెళ్లిపోవాలి కదా! అగ్రిగోల్డ్ బాధితులకూ రూ. 1150 కోట్లు ఇవ్వడం దగ్గర్నుంచి ఎస్సీ, ఎస్టీలు సహా అనేక పథకాలను స్వయంగా మేనిఫెస్టోలో ప్రకటించినా జగన్ఇవ్వలేదు. రైతులకు రూ. 12500 ఒకే సారి మే నెలలో ఇస్తామన్నారు. మరోసారి గెలిస్తే పదివేలు.. మిగిలిన ఆరు వేలు కేంద్రం ఇస్తుందట.
Also Read: మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !
మేనిఫెస్టోను పక్కన పెడితే పాదయాత్రలో ఇచ్చిన హామీల సంగతి చెప్పాల్సిన పని లేదు. అవి ఒక ఐదు వందలకుపైగా ఉంటాయి. వాటిపైనా సమాధానం లేదు. ఇలాంటి రాజకీయాన్ని ప్రజలు హర్షించరు.